తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా..?. ఇప్పటికే తొలి ప్రభుత్వంలో పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలుచేసి బంగారు తెలంగాణ నిర్మాణ దిశగా అడుగులు వేసిన ముఖ్యమంత్రి తాజాగా ఈ ప్రభుత్వంలో గ్రామ స్వరాజ్యం నిర్మించడానికి బాటలు వేస్తోన్న సంగతి విదితమే.
ఈ క్రమంలో ఇప్పటికే గ్రామాల్లో.. పల్లెల్లో ఆరవై రోజుల ప్రణాళికలు సిద్ధం చేస్తోన్నారు. తాజాగా పల్లెల్లో గ్రామాల్లో మారుమూల ప్రాంతాల్లో పచ్చదనం పెంచడానికి వ్యుహ్యారచనలు చేస్తోన్నారు సీఎం కేసీఆర్. అందులో భాగంగా ముప్పై రోజుల ప్రణాళిక ఈ నెల ఆరో తారీఖు నుంచి పంచాయతీల ప్రక్షాళన మొదలు కానున్నది. తొలివిడతగా పచ్చదనం,పరిశుభ్రత,పారిశుధ్యంపై దృష్టి పెట్టనున్నారు.
ప్రభుత్వ నిర్ణయానికి పల్లె ప్రజలు కూడా ఈ సందర్భంగా మద్ధతుగా నిలుస్తున్నారు. అందులోనే భాగంగా గల్లీలు గలీజు చేస్తే భారీ మొత్తంలో జరిమానాలు విధించనున్నారు. గ్రామాల్లో పల్లెల్లో చెట్లను నరికితే కూడా జరిమానా వాత పెట్టనున్నది సర్కారు. అయితే చెట్లను నరికిన.. బహిరంగ మూత్రం చేసినా.. బహిర్భూమికి వెళ్లినా కానీ జరిమానా విధిస్తారు కొత్తగా వచ్చిన పంచాయతీ చట్టం ప్రకారం.