టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆంధ్రప్రదేశ్ యైభుత్వ తీరుపై విమర్శలు చేశాడు. గుంటూరు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎంగా వైఎస్ జగన్ వంద రోజుల పాలన 100 తప్పటడుగులు, 100 తడబాట్లుగా సాగుతోందని ఎద్దేవా చేశారు. చంద్రబాబునాయుడుపై కక్షతో మద్య తరగతి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ విమర్శించారు. ఇసుక టెండర్లను వైసీపీ వాళ్లకు ఇవ్వడం సిగ్గుచేటని పేర్కొన్న డొక్కా, సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
