ఆంధ్రప్రదేశ్ ప్రబుత్వం కొత్తగా తీసుకువస్తున్న ఇసుక విదానంలో చౌకగా ఇసుక దొరికే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో టన్నుకు 126=50 ఉండగా, ఏపీలో దానిని 375 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించడం విశేషం. అది కూడా రవాణా వ్యయంతో కలిపి నిర్ణయించారు.దీనివల్ల వినియోగదారులపై గతంలో తక్కువ దరకు ఇసుక దొరికే పరిస్తితి వచ్చింది.ఒకటి, రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం సమీక్షించి, ఇసుక సరఫరా ధరను అధికారికంగా ప్రకటించనున్నారు.
రాష్ట్రంలో నూతన ఇసుక విధానాన్ని సెప్టెంబరు 5వ తేదీ నుంచి అమల్లోకి తీసుకొచ్చేందుకు అధికార యంత్రాంగం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఏపీఎండీసీ వెబ్‌సైట్ (యాప్) ద్వారా బుక్ చేసుకుని, ఆన్‌లైన్‌లో డబ్బు చెల్లించిన వారికి ఇసుకను స్టాక్ యార్డులో వాహనంలో లోడ్ చేసి ఇస్తారు. లోడింగ్ రుసుముతో కలిపి ఈ ధర ఉంటుంది. కేవలం స్టాక్ యార్డుల్లో ఇసుక అందించడంతోనే ప్రభుత్వం చేతులు దులుపుకోవడం లేదు. వినియోగదారుల వద్దకు తక్కువ ధరకే రవాణా చేసేలా ఏర్పాట్లు కూడా చేస్తోంది. జిల్లాల్లో ట్రాన్స్‌పోర్టర్స్ అసోసియేషన్‌తో (లారీలు, టిప్పర్ల ఓనర్ల) సంప్రదింపులు జరిపి, ఇసుక రవాణాకు వీలైనంత తక్కువ ధరలు ఖరారు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. కిలోమీటర్ రవాణాకు టన్నుకు రూ.4.90లోపే ఉండేలా చూడాలని సూచించింది. జిల్లా కలెక్టర్లు ఒకటి రెండు రోజుల్లోనే ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్ ప్రతినిధులు, రవాణా శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి, ఇసుక రవాణా ధరలు ఖరారు చేస్తారు. జీపీఎస్ పరికరాలు అమర్చుకుని, భూగర్భ గనుల శాఖ వద్ద రిజిస్టర్ చేసుకున్న వాహనాలతో స్టాక్ యార్డుల నుంచి ప్రజలకు ఇసుక రవాణా చేయవచ్చు.