దేశ వ్యాప్తంగా ఉన్న పలు వాహనదారులూ తస్మాత్ జాగ్రత్త. ఈ రోజు నుండి ట్రాఫిక్ చలాన్లు మారనున్నాయి. ట్రాఫిక్ రూల్స్ అధిగమించినవారికి ఈ మారిన చలాన్లు జేబులను గుళ్ల చేయనున్నాయి. మోటర్ వాహానాల చట్టం 1988కి కేంద్ర సర్కారు చేసిన సవరణలు ఈ రోజు ఆదివారం సెప్టెంబర్ ఒకటో తారీఖు నుండి అమల్లోకి రానున్నాయి. మరి ముఖ్యంగా కోర్టుకెళ్ళే కేసుల్లో ఈ కొత్త సవరణల్లో తీసుకున్న జరిమానాలనే న్యాయస్థానాలు విధించే అవకాశం స్పష్టంగా ఉన్నాయి. డ్రంకన్ డ్రైవ్,సెల్ ఫోన్ డ్రైవింగ్,మైనర్ డ్రైవింగ్,లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసేవారిపై ట్రాఫిక్ పోలీసులు కొత్తగా సవరణ చేసిన జరిమానాలనే విధిస్తారు. అందుకే ఈ రోజు నుంచి బయటకెళ్లే వాహనాదారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. పెంచిన జరిమానాలు ఇలా ఉన్నాయి.
సవరణలు చేసిన జరిమానాల వివరాలు
1)ట్రాఫిక్ ఉల్లంఘన పాతవి కొత్తవి(జరిమానాలు రూ.ల్లో)
2)హెల్మెట్ లేకపోతే 100 1000,3నెలలు లైసెన్స్ సస్పెండ్
3)సీటు బెల్ట్ ధరించకపోతే 100 1000
4)అర్హతలేని వ్యక్తికి వాహానమివ్వడం 1,000 5,000
5)లైసెన్స్ లేకుండా నడిపితే 500 5,000
6)వాహానాన్ని వేగంగా నడిపితే 400 1,000(ఎల్ఎంవీ వాహానం),2,000(మీడియమ్ ప్యాసింజర్ వాహానం)
7)ప్రమాదకరంగా/నిర్లక్ష్యంగా నడిపితే 1,000 5,000వరకు
8)సెల్ ఫోన్ మాట్లాడుతూ నడిపితే 1,000 5,000వరకు
9)సిగ్నల్ జంప్ చేస్తే 1,000 5,000వరకు
10)స్టాప్ లైన్ దాటితే 100 5,000వరకు
11)రాంగ్ రూట్లో నడిపితే 1000 5,000వరకు
12)డ్రంకన్ డ్రైవ్ 2000 10,000
13)రేసింగ్ 500 5000
14)పరిమితికి మించి ప్రయాణికులను 100 1,000ప్రతి ప్రయాణికుడికి
ఎక్కించుకుంటే
15)ట్రిపుల్ రైడింగ్ 100 2,000 & డ్రైవింగ్ లైసెన్స్ 3నెలల పాటు సస్పెండ్
16)అత్యవసరవాహానాలకు దారివ్వకపోతే 000, 10,000
17)అనవసరంగా హారన్ మ్రోగిస్తే 100 1,000
18)మైనర్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే — -వాహాన యజమాని దోషి అవుతాడు..
-3ఏండ్లు శిక్ష..25వేలు జరిమానా..
-జువైనల్ కోర్టులో మైనర్ల హాజరు..విచారణ
-వాహన రిజస్ట్రేషన్ రద్దు
19)వాహన పత్రాలు లేకుంటే — -డ్రైవింగ్ లైసెన్స్ స్వాధీనం… సెక్షన్ 183,184,185,189,190,194సీ,194డీ,194ఈ, కిందడ్రైవింగ్ లైసెన్స్ తాత్కాలికంగా నిలిపివేస్తారు
