జమ్మలమడుగులో దశాబ్దాలుగా ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ గొడవలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ రెండు కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ తగాదాల్లో ఎందరో అమాయకులు బలైపోయారు. అయితే 2014 లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యే అయిన ఆదినారాయణ రెడ్డిని ప్రలోభపెట్టి తన పార్టీలోకి చేర్చుకుని మంత్రి పదవి ఇచ్చాడు. దీంతో ఆ ఎన్నికల్లో ఆదినారాయణ రెడ్డిపై ఓడిపోయిన టీడీపీ నేత రామసుబ్బారెడ్డి వర్గం మండిపడింది. కాని చంద్రబాబు తెలివిగా రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి బుజ్జగించాడు. అయితే ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరిన తర్వాత కూడా ఈ రెండు వర్గాల మధ‌్య విబేధాలు తగ్గలేదు. ప్రభుత్వ పనుల్లో, కాంట్రాక్టుల్లో ఆదినారాయణరెడ్డి వర్గం పెత్తనం చేస్తుందంటూ రామసుబ్బారెడ్డి చంద్రబాబుకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఇద్దరిని పిలిపించి ప్రభుత్వ పనుల్లో , కాంట్రాక్టుల్లో వచ్చే ప్రతి రూపాయి చెరి సగం పంచుకోండి అంటూ చంద్రబాబు ఈ మ్యాటర్‌ను సెటిల్ చేశాడు. ఇక అప్పటినుంచి వీరిద్దరు దోపిడీలో చెరిసగం పంచుకుంటూ వచ్చారు. కాగా 2019 సార్వత్రిక ఎన్నికలలో ఆదినారాయణరెడ్డిని కడప పార్లమెంట్ బరిలో నిలిపి, రామసుబ్బారెడ్డిని జమ్మలమడుగులో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాడు చంద్రబాబు..ఈ ఎన్నికలలో వైసీపీ అభ్యర్ధి సుధీర్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందారు. గత 3 నెలలుగా సుధీర్ రెడ్డి నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను తీరుస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నాడు.
తాజాగా సోలార్ ప్లాంట్ సంస్థ నుంచి సుధీర్‌రెడ్డి వసూళ్లు సాగించారు, అక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఉద్యోగాల నుంచి తొలగించారు.. అంటూ రామసుబ్బారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలకు స్పందించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ‘మీరిద్దరూ వాటాలు వేసుకుని వచ్చిన ప్రతి రూపాయినీ పంచుకున్నట్టుగా ఒప్పుకున్నారు. వాటాలు తేలాయి కాబట్టి గొడవలు లేవని ప్రకటించుకున్నదీ మీరే. అలా పంచుకుని, సాంతం నాకేసి.. ఇప్పుడు మా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారా?’ అంటూ ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిలపై విరుచుకుపడ్డారు. నిజమే కదా…దోచుకున్న ప్రతి రూపాయిలో నీకు ఇంత..నాకు ఇంత అని వాటాలు పంచుకున్న అవినీతి చక్రవర్తులు ఇప్పుడు ప్రత్యర్థి అవినీతికి పాల్పడ్డాడు అంటూ విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని జమ్మలమడుగు ప్రజలు అంటున్నారు. మొత్తంగా రామసుబ్బారెడ్డి ఆరోపణలకు వైసీపీ ఎమ్మెల్యే ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు జమ్మలమడుగులో హాట్‌టాపిక్‌గా మారింది.