సిద్దిపేట జిల్లా కేంద్రంలో పొన్నాల పరిధిలో నిర్మిస్తున్న టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణ పనులను మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ… రాష్ట్రంలో పార్టీ ఆఫీస్ లు జిల్లా కేంద్రాల్లో నిర్మిస్తున్నామని..సిద్దిపేట జిల్లా పార్టీ కార్యాలయ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.ఇప్పటివరకు నిర్మాణ పనుల్లో రాష్ట్రంలోనే సిద్దిపేట పార్టీ కార్యాలయం ఫస్ట్ ఉందని చెప్పారు. దసరా పండుగ లోపు కార్యాలయం అందుబాటులో తెచ్చే విధంగా పనులు ముమ్మరంగా చేయాలన్నారు. సీఎం జిల్లా లో పార్టీ ఆఫీస్ అద్బుతంగా నిర్మించాలని , రాష్ట్రంలో మన పార్టీ కార్యాలయం మోడల్ గా నిలవాలని సూచించారు.. షేడ్ నిర్మాణ పనులు, ప్రహరి గోడ నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలన్నారు.. దసరా లోపే కార్యాలయ భవన నిర్మాణ పనులు పూర్తి చేసి సీఎం కేసీఆర్ గారిచే తొలి పార్టీ కార్యాలయం ప్రారంభించే విధంగా పనులు వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పారు.. ఈ సందర్భంగా షేడ్ , కిచెన్, పార్కింగ్ , ప్రహరీ గోడ చెపట్టే నిర్మాణ పనులను పరిశీలించారు.
