తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో సర్కారు చేస్తోన్న పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్శితులై ఆ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతుంది. తాజాగా జనగాం జిల్లాలో అధికార టీఆర్ఎస్లోకి వలసలు మొదలయ్యాయి.
ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రలో కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ కౌన్సిలర్లు వెన్నెం శ్రీలత సత్య నిరంజన్ రెడ్డి, ఆలేటి లక్ష్మీ సిద్ధిరాములు, మంగం సత్యం, పన్నీరు రాధికా ప్రసాద్ తమ అనుచరులతో గులాబీ కండువా కప్పుకున్నారు.వీరందర్నీ స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో మనుగడ లేదనీ, వారికి జాతీయ స్థాయిలోనే నాయకత్వం సరిగ్గా లేదన్నారు. కాంగ్రెస్ రానున్న ఎన్నికల్లో తన పూర్తి మనుగడను కోల్పోతుందనీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నయం లేదన్నారు.