దెందులూరు నియోజకవర్గంలో రౌడీరాజ్యాన్ని నెలకొల్పి పదేళ్లుగా అరాచకానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన చింతమనేని ప్రభాకర్ పరారీ కావడం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దళిత యువతపై దాడికి యత్నించిన సంఘటనలో ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు కావడంతో శుక్రవారం పోలీసుల కళ్లు కప్పి ఉడాయించిన సంగతి తెలిసిందే. దీంతో ఉలిక్కిపడిన పోలీసులు గాలింపు తీవ్రతరం చేశారు. ఐదుగురు సీఐల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను నియమించి గాలిస్తున్నారు. శనివారం చింతమనేని ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయన ఇంటి ముందు డీఎస్పీ ఎదుట హాజరుకావాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామంటూ నోటీసులు అతికించారు. గృహనిర్బంధంలో ఉన్న వ్యక్తి పోలీసుల ముందు నుంచే ఉడాయించడం పోలీసుశాఖలో తీవ్ర చర్చకు దారితీసింది. వంద మంది పోలీసులు ఇంటి ముందు ఉదయం నుంచి కాపలాకాసినా బయటకు రాని చింతమనేని పోలీసుల సంఖ్య తగ్గిన సమయం చూసుకుని వెళ్లిపోయారు. ఈ సంఘటనను జిల్లా పోలీసు ఉన్నతాధికారి సీరియస్‌గా తీసుకోవటంతో కిందిస్థాయి అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఎస్పీ ..డీఎస్పీలు సీరియస్ అయ్యారంట.
