ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. కృష్ణానది వరదల విషయంలో ప్రభుత్వం విఫలం చెందిందని ఆయన ఆరోపించారు. సహాయ చర్యలలో నిర్లక్ష్యం కనిపించిందని ఆయన చెప్పారు. ప్రకాశం బారేజీ వద్ద నీటిని సకాలంలో తగ్గించలేదని, ఒకేసారి రెండున్నర లక్షల క్యూసెక్యుల నీరు వదలడంతో లంక గ్రామాలు ముంపునకు గురి అయ్యాయని ఆయన అన్నారు.తన ఇంటికి నోటీసులు ఇవ్వడం, డ్రోన్ లు వేయడంలో చూపిన శ్రద్ద వరద బాదితుల విషయంలో చూపలేదని ఆయన అన్నారు.రాజదానికి ముంపు ప్రచారం అంతా ఉద్దేశపూర్వకంగా చేసినట్లు కనిపిస్తుందని ఆయన అన్నారు.
