తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ రోజు ఆదివారం పరకాల నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాoపు కార్యాలయంలో పరకాల మరియు నడికూడ మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన కళ్యాణలక్షి/షాదిముబారక్ లబ్ధిదారులకు చెక్కులను వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ ,పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా ఇంతవరకు కళ్యాణలక్ష్మి లాంటి పథకం లేదన్నారు.బడుగుబలహీన వర్గాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసిఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమన్నారు.మన రాష్ట్రంలో అమలుచేసిన సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆదర్శంగా తీసుకొని అమలుచేస్తున్నారన్నారు.
కేసీఆర్ గారి ఆదర్శపాలన చూసి ఓర్వలేకనే ఇతర పార్టీలు తెరాసపై దుష్ప్రచారాలు చేస్తున్నారన్నారు.ప్రజల గుండెల్లో నిలిచిన కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎవరెన్ని విధాలుగా కుట్రలుపన్నిన ఏమిచేయలేరన్నారు.
ఎంపీ పసునూరి దయాకర్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం,అన్ని రంగాల్లో అభివృద్ధిపథంలో ముందంజలో
Post Views: 280