తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా ఈఎస్ఎల్ నరసింహాన్ ను కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసి నూతన గవర్నర్ గా సౌందర్ రాజన్ ను నియమించిన సంగతి తెల్సిందే. తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ గా నియమించబడిన సౌందర్ రాజన్ గురించి తెలియని విషయాలపై ఒక లుక్ వేద్దామా.. సౌందర్ రాజన్ మాములుగా వృత్తిరిత్యా డాక్టర్. తమిళనాడులోని కన్యకుమారి జిల్లా నాగర్ కోయిల్‌లో ఆమె జన్మనించారు. ప్రస్తుతం ఆమె బీజేపీ జాతీయ కార్యదర్శిగా కూడా ఉన్నారు. మద్రాస్ మెడికల్ కాలేజీలో సౌందర్ రాజన్ ఎంబీబీఎస్ చదివారు. ఆ సమయంలో విద్యార్థి సంఘం నేతగా కూడా పనిచేశారు. ఇప్పటివరతమిళనాడు బీజేపీ యువ మహిళా నేతగా తమిళ సై సౌందర్ రాజన్ మంచి గుర్తింపు ఉంది. అయితే ఇటీవల గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో సౌందర్ రాజన్ డీఎంకే మహిళా నేత కనిమోళిపై స్వల్ప ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. మొదటి నుంచి ఆమె బీజేపీలో అంకితభావంతో పనిచేయడంతో ఆమెకు ఈపదవి దక్కిందని విశ్లేషకులు చెబుతున్నారు. సౌందర్ రాజన్ తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా కూడా పదవీ బాధ్యతలు నిర్వహించారు.
