ముప్పై ఏళ్ళుగా టీడీపీ గుప్పట్లో ఉన్న విశాఖ డైరీ ఇక వైసీపీ చేతిలోకి మారనుంది. అందుకు కారణం విశాఖ డెయిరీ చైర్మన్ అడారి ఆనంద్, తన 12 మంది డైరెక్టర్లతో కూడిన బృందం వైసీపీ లో చేరాలని నిర్ణయం తీసుకుని చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు . ఈ నిర్ణయంతో ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. సెప్టెంబర్ 1న విజయవాడలో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఆనంద్ వైసీపీలో చేరటానికి అడారి ఆనంద్ సిద్ధం అవుతున్నారు . వీరి చేరికతో సుమారు మూడు దశాబ్ధాలుగా టీడీపీ చేతిలో ఉన్న విశాఖ డైరీ ఇప్పుడు వైసీపీ పార్టీలోకి వెళ్లనుంది . ఇక జిల్లాలో టిడిపి స్ట్రాంగ్‌మన్‌గా పరిగణించబడిన అడారీ తులసి రావు కుమారుడు ఆనంద్ పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో ఆయన మాట్లాడుతూ , పాడి పరిశ్రమతో సంబంధం ఉన్న రైతులు కూడా త్వరలో వైసీపీలో చేరనున్నారని ప్రకటన చేశారు. దీంతో చంద్రబాబుకు ఉత్తరంధ్రాలో ఊహించని షాక్ తగిలింది.విశాఖ డైరీ డైరెక్టర్స్ 12 మంది , మరియు యలమంచిలి మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ రమాకుమారితో పాటు పలువురు టీడీపీ నేతలు వైసీపీ గూటికి చేరనున్నారు.ఈ మేరకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు.
