మెగాస్టార్ చిరంజీవికి పెను ప్రమాదం తప్పింది. వ్యక్తిగత పనుల నిమిత్తం ముంబై వెళ్లిన చిరు తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరారు. తిరుగు ప్రయాణంలో విస్తారా ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణించారు. ముంబై నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన ఈ ఫ్లయిట్ టేకాఫ్ అయిన అరగంటకే విమాన సిబ్బంది సాంకేతిక సమస్యలు గుర్తించారు. ప్రమాదాన్ని పసిగట్టిన పైలెట్ వెంటనే విమానాన్ని వెనుకకు మళ్లించి ముంబై ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. కాగా చిరు ప్రయాణిస్తున్న ఈ విమానంలో దాదాపు 120 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారు. విమానాన్ని వెనుకకు మళ్లిస్తున్నట్టు తెలియగానే ప్రయాణికులు ఆందోళనకు లోనైనట్టు సమాచారం. ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అర్ధగంట సేపు భయాందోళనలకు లోనైనట్టు సమాచారం. పైలెట్ చాకచక్యంగా వ్యవహరించి సేఫ్‌గా ల్యాండ్ చేయడంతో ఆందోళన నుంచి బయటపడినట్టు సమాచారం. ప్రమాదం నుంచి సురక్షితంగా తప్పుకొన్న ప్రయాణికులకు మరో అసౌకర్యం కలిగినట్టు తెలిసింది. విమానం నుంచి బయటకు వచ్చిన ప్రయాణికులు మరో విమానం కోసం గంటలపాటు పడిగాపులు పడ్డట్టు సమాచారం. అనంతరం మరో విమానాన్ని ఏర్పాటు చేసి ప్రయాణికులను హైదరాబాద్‌కు పంపించినట్టు తెలిసింది. అయితే ఓ ప్రయాణికుడు చిరంజీవి ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఈ ప్రమాద ఘటన బయటకు వచ్చింది. మెగాస్టార్ చిరు ప్రయాణిస్తున్న ఫ్లైట్ సాంకేతిక లోపాలతో వెనక్కి మళ్లిందనే వార్తలతో మెగా ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. అయితే..ఆ ఫ్లైట్ ముంబైలో సేఫ్‌గా ల్యాండ్ అవడంతో చిరు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లైంది.. కాగా ఫ్లైట్ సాంకేతిక లోపాలతో వెనక్కి తిరుగుతుందని తెలిసిన చిరు పెద్దగా గాభరాపడకుండా కామ్‌గా కూర్చోవడం ఫోటోలో కనిపించింది. గతంలో కూడా చిరు ప్రయాణిస్తున్న విమానం…సాంకేతిక లోపాలతో అకస్మాత్తుగా పంట పొలాల్లో ల్యాండ్ అయింది. అప్పడుు ఆ విమానం నుంచి చిరు కిందకు దూకాల్సి వచ్చింది. ఆ సమయంలో చిరు వెంట విజయశాంతి వంటి స్టార్ హీరోయిన్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఉన్నారు. తాజాగా మరోసారి విమాన ప్రయాణంలో చిరుకు పెను ప్రమాదం తప్పడంతో మెగాభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
