మాట తప్పని, మడమ తిప్పని నైజం వైయస్ కుటుంబానిది అని వైయస్ తనయుడు సీఎం జగన్ నిరూపిస్తున్నారు. సుదీర్ఘ పాదయాత్రలో మద్యం రక్కసికి బలైపోయిన కుటుంబాల గోడును విన్న జగన్ అధికారంలోకి రాగానే నవరత్నాల్లో భాగంగా రాష్ట్రంలో దళల వారీగా సంపూర్ణ మద్యనిషేధం అమలు చేస్తామని, లక్షలాది మహిళల కన్నీళ్లు తుడుస్తామని ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం మద్యనిషేధంపై ముందడుగు వేస్తున్నారు సీఎం జగన్. తొలుత గ్రామాల్లో కుటుంబాల బతుకులను చిధ్రం చేస్తున్న బెల్టు షాపులపై ఉక్కుపాదం మోపారు. దీంతో మద్యం అమ్మకాలు కూడా తగ్గాయని, రెవిన్యూ కూడా తగ్గిందని ఎక్సైజ్ శాఖ తెలుపుతోంది. రాష్ట్రానికి ప్రధాన ఆదాయవనరు మద్యమే. అయినా జగన్ ఇచ్చిన మాట ప్రకారం మద్యనిషేధాన్ని దశల వారీగా అమలు చేయడానికే మొగ్గు చూపుతున్పారు. దీంతో రాష్ట్రంలో మద్యం వినియోగం క్రమేణా తగ్గుతోంది.
తాజాగా మద్యనిషేధంపై సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మద్యనిషేధంపై దశలవారీగా అడుగులు వేస్తున్నామని దశలవారీ మద్య నిషేధం దిశగా అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. బెల్టు షాపులపై ఉక్కుపాదం వేశామని.. ఫలితంగా మద్యం వినియోగం భారీగా తగ్గుతోందని శుక్రవారం ట్విటర్లో తెలిపారు. ‘అక్టోబరు నుంచి 20 శాతం మద్యం దుకాణాలతో పాటు బార్ల సంఖ్యను తగ్గిస్తాం. అక్రమ మద్యాన్ని, నాటు సారాను తగ్గించేందుకు గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసులను నియమిస్తున్నాం. దశలవారీ మద్య నిషేధం దిశగా అడుగులు వేస్తున్నాం’ అని ట్వీట్ చేశారు. దీంతో రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా..ఇచ్చిన మాట ప్రకారం దశలవారీగా మద్యనిషేదం దిశగా అడుగులు వేస్తున్న సీఎం జగన్ను ఏపీ ప్రజలంతా అభినందిస్తున్నారు. ముఖ్యంగా తమ మద్యం రక్కసిని తరిమికొట్టి తమ జీవితాలను నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్న సీఎం జగన్ను లక్షలాది మహిళలు నిండు మనసుతో కలకాలం జగన్ అన్న సీఎంగా ఉండాలంటూ దీవిస్తున్నారు.