కీసర గుట్టలో ఎకో ఫ్రెండ్లీ గ్రీనరి పార్క్‌కు రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ శంకుస్ధాపన చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..ఎంపీ సంతోష్ కుమార్ ప్రకృతి ప్రేమికుడని అన్నారు. ఎంపీ నిధులతో కీసర అడవిని అభివృద్ధి చేయడం గొప్ప విషయం అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎంపీ సంతోష్ ముందున్నారని చెప్పారు. గత ప్రభుత్వాలు అడవులను ధ్వంసం చేశాయి. హరితహారం లాంటి కార్యక్రమం దేశంలో ఏ రాష్ట్రంలో లేదన్నారు.
