గత కొద్ది రోజులుగా వైసీపీ ప్రభుత్వం అమరావతి నుంచి రాజధానిని తరలిస్తుందంటూ చంద్రబాబు, టీడీపీ నేతలతో సహా ఎల్లోమీడియా ఛానళ్లు దుష్ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలి వరదల నేపథ్యంలో రాజధానిగా అమరావతి సేఫ్ కాదని…నిర్మాణాలకు అధిక మొత్తంలో ఖర్చుపెట్టాల్సి వస్తుందన్న మంత్రి బొత్స వ్యాఖ‌్యలను ఎల్లోమీడియా ఛానళ్లు వక్రీకరించాయి. వైసీపీ ప్రభుత్వం రాజధానిని అమరావతి నుంచి దొనకొండకు తరలిస్తుందంటూ…భూములిచ్చిన రైతులకు అన్యాయం చేయబోతుందంటూ…పచ్చ మీడియా ఛానళ్లు కథనాలు వండి వార్చాయి. రాజధాని తరలిపోతుందంటూ డిబెట్లు పెట్టి…పచ్చనేతలతో రెచ్చిపోయేలా మాట్లాడించి…రాజధాని రైతుల్లో గందరగోళం క్రియేట్ చేయడానికి ఎల్లోమీడియా ఛానళ్లు నానా తంటాలు పడ్డాయి. అయితే తాజాగా అమరావతిపై జాతీయ మీడియా ఛానళ్ల కథనాలు ఎల్లోమీడియాకు గుణపాఠమే అని చెప్పాలి.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఏపీ రాజధాని గురించి కొద్ది రోజులుగా సాగుతున్న రగడకు ప్రభుత్వం ముగింపు పలికింది. రాజధాని అమరావతిలోనే కొనసాగుందని స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు జాతీయ మీడియా కధనాలు ప్రసారం చేసింది. ప్రస్తుతం రాజధానిగా ఉన్న అమరావతి భవిష్యత్ లోనూ రాజధానిగా కొనసాగుతుందని జగన్ ప్రభుత్వం స్పష్టం చేసినట్లు ఓ జాతీయ వార్తా ఛానల్ పేర్కొంది. రాజధాని తరలించే ఉద్దేశం ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు లేదని స్పష్టం చేసింది. అయితే, అమరావతిలో మాత్రమే కాకుండా ఏపీ మొత్తంగా అధికార వికేంద్రీకరణ జరగాలనే ఉద్దేశం తో ముఖ్యమంత్రి ఉన్నారని జాతీయ మీడియా వివరించింది. అమరావతి పరిపాలన రాజధానిగా ఉంటుందని,. .అదే సమయంలో ప్రభుత్వ రంగ సంస్థలు..కొత్తగా ఏర్పాటు చేసే కార్యాలయాలు మాత్రం వికేంద్రీకరణ దిశగా నిర్ణయం చేస్తారని సదరు జాతీయ మీడియా ఛానల్ చెప్పుకువచ్చింది. ఇప్పటికే అమరావతిలోనే రాజధాని ఉంటందని మంత్రి బొత్సతో పాటు పలువురు వైసీపీ మంత్రులు స్పష్టత ఇచ్చారు. ఇక, ఇప్పుడు జాతీయ మీడియా సైతం అమరావతి ఏపీ రాజధానిగానే ఉంటుందని కధనాలు ప్రసారం చేసింది. మొత్తంగా ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలించే ఉద్దేశ్యం సీఎం జగన్‌కు లేదని జాతీయ మీడియా స్పష్టం చేసింది. దీంతో రాజధాని తరలిపోతుందంటూ గత వారం రోజులుగా గగ్గోలు పెడుతున్న చంద్రబాబుకు ,ఎల్లోమీడియా ఛానళ్లకు ,జాతీయ మీడియా గడ్డిపెట్టినట్లయింది.