పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అంటే ఠక్కున వరికోల్ శ్రీమంతుడు అని గుర్తు పడతారు. ఆయన అంతగా తనకు జన్మనిచ్చిన ఊరికి అంతగా మేలు చేశారు.ఇంట గెలిచి రచ్చ గెలవాలని పెద్దలు చెబుతుంటారు. దాన్నే నిజం చేస్తూ పోచంపల్లి గత సార్వత్రిక ఎన్నికల నుండి నిన్నటి స్థానిక సంస్థల ఎన్నికల వరకు.. ఆసరా పెన్షన్ నుండి హరితహారం వరకు కార్యక్రమం ఏదైన సరే తన గ్రామాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా గ్రామంగా తీర్చిదిద్దారు. పేదవాళ్లకు తన సొంత స్థలంలోనే డబుల్ బెడ్ రూం ఇండ్లు మొదలు.. ఆ గ్రామంలోనూ.. ఆ గ్రామం చుట్టూ ఉన్న పలు ఊర్లకు రోడ్లను వేయించి అభివృద్ధంటే ఏంటో రుచి చూపించారు.
అయితే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. దీంతో ఆయన దృష్టి ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధిపై పడింది. ఈ క్రమంలో ఈరోజు చారిత్రక పర్యాటక ప్రదేశం శ్రీ శ్రీ రామలింగేశ్వరస్వామి రామప్ప దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్సి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి. ఆయనతో పాటు ములుగు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి గారు, రాష్ట్ర చైర్మన్ డాః వాసుదేవరెడ్డి గారు, రైతు రుణ విముక్తి కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంక్కన్న గారు,కూడ చైర్మన్ యాదవరెడ్డి గారు ములుగు జెడ్పి చైర్మన్ కుసుమ జగదీష్,ములుగు జిల్లా జెడ్పిటిసి సభ్యులు, ఎంపిటిసి సభ్యులు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్సి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రామప్ప ఆలయం ప్రపంచపటంలో మెరిసే అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో జారవిడిచుకోరాదు.. ఇందులో భాగంగా యునెస్కో గుర్తింపునకు కావాల్సిన మౌలిక వసతుల కల్పనపై కృషిచేస్తా..ఆలయ పరిసరాలు,పార్క్, పార్కింగ్,రోడ్లు, విద్యుత్ వంటి మౌలిక వసతుల ఏర్పాటు.. ఆలయ తూర్పు స్వాగత శిలాతోరణం ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు..
Post Views: 265