మేడ్చల్ జిల్లా కీసరగుట్టలోని 2024 ఎకరాల అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకుని ఎకో పార్కుగా అభివృద్ధి చేయడం కోసం కీసరగుట్టకు చేరుకుని హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటిన రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్, పాల్గొన్న కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, కలెక్టర్ ఎం.వి.రెడ్డి, జేసీ శ్రీనివాస్ రెడ్డి, ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, పలువురు అధికారులు, పలు కళాశాలల,పాఠశాలలు విద్యార్థినీ విద్యార్థులు, టీఆర్ఎస్ కార్యకర్తలు.
ఈ సందర్భంగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ”మా అన్న పుట్టినరోజు సందర్భంగా కేటీఆర్ కు ఏం గిప్ట్ ఇవ్వాలని ఆలోచించి గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా పవిత్ర పుణ్యక్షేత్రమైన కీసరగుట్టలోని 2042 ఎకరాల అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేసి కేటీఆర్ చేత కేక్ కట్ చేయిస్తానని ఎంపీ సంతోష్ కుమార్ తెలిపారు.
కీసరగుట్ట అటవీ ప్రాంతాన్ని ఎకో టూరిజం పార్క్ గా అభివృద్ధి చేసేందుకు తనకు వీలైనంత సమయం కేటాయించి కీసరగుట్టను మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.