ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనలో కోర్టు ఆదేశాలతో ఐదుగురిని రిమాండ్‌కు తరలించినట్లు కార్వేటినగరం ఎస్ఐ ప్రియాంక తెలిపారు.ఆమె తెలిపిన వివరాల ప్రకారం… టీడీపీ నేత, కార్వేటినగరం మాజీ ఎంపీపీ జనార్దనరాజు ఈనెల 26న తన అనుచరులు అణ్ణామలై, శ్రీనివాసులు, సూర్యప్రకాష్‌రెడ్డి, శ్యామరాజుతో కలసి విహారయాత్రకు తలకోన వెళ్లారు. అక్కడ మద్యం మత్తులో సీఎం జగన్, ఆయన కుటుంబ సభ్యులు, ఎంపీ విజయసాయిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో పుత్తూరు డీఎస్పీ మురళీధర్ చర్యలకు ఉపక్రమించారు. ఆయన ఆదేశాలతో శుక్రవారం రాత్రి 5 మందిని అరెస్టు చేసి పుత్తూరు కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ ప్రియాంక పేర్కొన్నారు. అయితే ఇటీవలనే కృష్ణానదికి వచ్చిన వరదల నేపథ్యంలో రైతు వేషంలో ఉన్న ఓ యువకుడు సీఎం జగన్‌ను.. ముఖ్యంగా మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌ను కులం పేరుతో దూషించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వచ్చింది. దీంతో వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు అతడిని గుంటూరు జిల్లాకు చెందిన శేఖర్ చౌదరిగా గుర్తించి కొద్ది రోజుల క్రితం నిందితుడు శేఖర్ చౌదరిని అరెస్ట్ చేశారు
