ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరత నెలకొందంటూ టీడీపీ దర్నాలు చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశంపై తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. దేన్నయినా సహిస్తాం కానీ, పేదల జోలికి వస్తే మాత్రం ఖబడ్దార్ అంటూ ఏపీ సర్కారును హెచ్చరించారు. పేదలకు అన్యాయం జరుగుతుంటే టీడీపీ చూస్తూ ఊరుకోదని ట్వీట్ చేశారు. ఇసుక కొరత కారణంగా లక్షల మంది పేదవాళ్ల ఉపాధి మార్గాలను కూల్చివేశారని, ఆఖరికి వాళ్ల ఇళ్లను కూడా కూల్చివేసి నిలువ నీడలేకుండా చేస్తారా? అంటూ మండిపడ్డారు. అయితే ఈ వాక్యలపై వైసీపీ సోషల్ మీడియా అభిమానులు విచిత్రంగా కౌంటర్ ఇస్తున్నారు. మీ పార్టీలోనే ఇసుక దందా నడిచిందని అందరికి తెలుసు..మరి ముఖ్యంగా ఇసుకు దందా ఆపిన ఎమ్మార్వో వసజాక్షిపై దాడిచేయించిన నువ్వు..మీ పార్టీ నేతలు ఈ రోజు ఇసుక గురించి దర్నా చెయ్యడం ఏమిటో అంటూ కామెంట్ల్ పెడుతున్నారు.
