టీడీపీ ఐదేళ్లు తిరిగేసరికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడి గత ప్రాభవాన్ని కోల్పోయింది. మూడు నెలల కిందట జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనానికి ఆ పార్టీ కోటలు కుప్పకూలిపోయాయి గడిచిన ఎన్నికల్లో అత్యంత దారుణంగా ఓడిపోయిన తెలుగుదేశం పార్టీలో ఉంటే ఇక మాకు రాజకీయ భవిష్యత్ ఉండదని మరో 20 ఏళ్లు వైసీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ నే ఉండబోతున్నారని తెలుసుకోని వైసీపీలో చేరుతన్నట్లు సమచారం. తాజాగా పార్టీని వీడే వారిలో రామచంద్రపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్లు ప్రముఖంగా ప్రచారంలో ఉన్నాయి. వీరిద్దరిలో ప్రస్తుతానికి జ్యోతుల పార్టీలో క్రియాశీలకంగా ఉన్నా తోట మాత్రం ఇటీవల కాలంలో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. త్రిమూర్తులు పార్టీ అధిష్టానం తీరుపై అసంతృప్తితో ఉన్నారని పార్టీ ద్వితీయశ్రేణి నేతలు చెబుతున్నారు. ఒకరొకరుగా జిల్లా టీడీపీలో ముఖ్యులు త్వరలో రాజీనామా బాట పట్టేలా కనిపిస్తున్నారు. కాగా గురువారం రోజు డీసీసీబీ చైర్మన్, ఆప్కాబ్ వైస్ చైర్మన్‌గా ఉన్న వరుపుల జోగిరాజు (రాజా) టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు విజయవాడలో మీడియాకు వెల్లడించిన సంగతి తెలిసిందే.
