గత ఐదేళ్ల చంద్రబాబు హయాంలో సత్తెనపల్లి, నరసరావుపేటలలో కోడెల ఫ్యామిలీ సాగించిన దురాగతాలు అన్నీ ఇన్నీ కావు. కే ట్యాక్స్ పేరుతో కోడెల, ఆయన కొడుకు, కూతురు… భూ కబ్జాల నుంచి, ఫ్లాట్ల ఆక్రమణలు, రెస్టారెంట్లు, చికెన్ కొట్లు…ఇలా ఎవరిని వదల్లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి చిరు వ్యాపారుల వరకు ప్రతి ఒక్కరి దగ్గర కే ట్యాక్స్ పేరుతో కోట్లు వసూలు చేశారు. కే ట్యాక్స్ కట్టకుండా ఎదురుతిరిగిన వారిపై భౌతిక దాడులకు పాల్పడడం, అక్రమ కేసుల్లో ఇరికించడం…కోడెల ఫ్యామిలీకి పరిపాటి. ఇలా కోడెల ఫ్యామిలీ నరసరావుపేట, సత్తెనపల్లి అరాచకం సృష్టించింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోడెల ఫ్యామిలీ పాపం పండింది. కే ట్యాక్స్ బాధితుల ఫిర్యాదులతో కోడెల కుటుంబ సభ్యులపై పలు కేసులు నమోదు అయ్యాయి.
తాజాగా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుపై నమోదైన కే ట్యాక్స్ కేసుల్లో హైకోర్ట్ కీలక తీర్పు ఇఛ్చింది. ఇవాళ కోడెల కుటుంబ సభ్యులపై సత్తెనపల్లి , నరసరావు పేట పోలీస్‌స్టేషన్లలో నమోదైన 5 కే ట్యాక్స్ కేసుల్లో విచారణ జరిపిన హైకోర్ట్…కోడెల శివన్రసాదరావ, ఆయన కుమారుడు శివరామకృష్ణకు బెయిల్ మంజూరు చేసింది.. అయితే హైకోర్టు పలు షరతులు విధించింది. సెప్టెంబర్ 6 వ తేదీలోగా కోర్టులో లొంగిపోవాలని, అదే సమయంలో బెయిల్ వస్తుందని తెలిపింది. అయితే కోడెల , ఆయన కొడుకు విజయవాడ దాటి బయటకు వెళ్లకూడదని, ప్రతి సోమ, బుధ, శనివారాల్లో పోలీసుల ముందు హాజరు కావాలి…ఈ కేసుల విచారణలో పోలీసులకు పూర్తిగా సహకరించాలని హైకోర్ట్ పేర్కొంది. మొత్తంగా ప్రతి శుక్రవారం జగన్ కోర్టుకు పోవాలంటూ గతంలో ఎద్దేవా చేసిన కోడెల వంటి టీడీపీ నేతలకు…ఇప్పుడు ప్రతి సోమ, బుధ, శనివారాలు అంటే వారంలో మూడు రోజులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సంతకాలు పెట్టి రావాల్సి వచ్చింది. విధి వైచిత్రం అంటే ఇదేనేమో…