కొత్త ఇసుక విధానంలో రవాణా టెండర్లను రద్దు చేస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇసుక తరలింపుకు కి.మీకి అతి తక్కువ ధర కోట్ చేయడంతో టెండర్లను రద్దు చేసింది. జిల్లా మొత్తం ఒకే కాంట్రాక్టర్ ఉంటే ఇబ్బందులు వస్తాయని టెండర్లు రద్దును ఆమోదించింది ప్రభుత్వం. కి.మీ ఇసుకకు 4 రూపాయల 90 పైసలను ఖరారు చేసింది ఏపీ సర్కార్. జీపీఎస్ ట్రక్కుల ఉన్న యజమానులు దరఖాస్తు చేసుకుంటే అందరీకీ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇసుక రవాణా టెండర్లను రద్దు చేస్తూ..గనుల శాఖ కార్యదర్శి 2019, ఆగస్టు 30వ తేదీ శుక్రవారం రాత్రి APMDC అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇప్పటి వరకు ట్రక్కులు, ట్రాక్టర్లలో ఇసుక తరలించడానికి పిలిచిన టెండర్లు మొత్తం రద్దయ్యాయి. GPS ఉన్న వారు గనుల శాఖ సహాయ సంచాలకుల కార్యాలయంలో వివరాలు నమోదు చేసుకుంటే వారందరికీ ఇసుకను తరలించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
