గ త ఐదేళ్లలో చంద్రబాబు, లోకేష్‌ల అండతో, అధికారంలో ఉన్నామనే అహంకారంతో అవినీతి, అక్రమాలకు పాల్పడిన టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా కేసుల్లో ఇరుక్కుంటున్నారు..కోడెల, సోమిరెడ్డి, కూన రవికుమార్, కరణం బలరాం, యరపతినేని శ్రీనివాసరావు..ఇలా వరుసగా టీడీపీ నేతలు ముద్దాయిలుగా కోర్టుల ముందు నిలబడుతున్నారు. తాజాగా అక్రమ మైనింగ్ కేసులో గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై ఉచ్చు బిగుసుకుంటోంది. సున్నపు రాయి అక్రమ మైనింగ్ కేసును ప్రభుత్వం సీబీఐకి అప్పగించవచ్చు అని తేల్చి చెప్పింది. దీంతో యరపతినేని అజ్ఞాతంలో ఉంటూ..ఈ కేసు నుంచి బయటపడడానికి లాయర్ల దగ్గర సలహాలు తీసుకుంటున్నాడని సమాచారం.
తాజాగా అక్రమ మైనింగ్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం తీర్పును వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. అంతకు ముందు ధర్మాసనం సీఐడీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 24 మంది సాక్షులు యరపతినేనికి వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చినా అతన్ని ఇప్పటివరకు ఎందుకు విచారించలేదని నిలదీసింది. లక్షల మెట్రిక్ టన్నుల ఖనిజం తరలిపోవడమంటే.. అధికారుల సహకారం లేకుండా సాధ్యమయ్యే పనే కాదని, ఆ అధికారులపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని హైకోర్ట్ ప్రశ్నించింది. దీంతో అధికారులు ఈ కేసును పూర్తి స్థాయిలో విచారించి, పూర్తి స్థాయి ఆధారాలు సేకరించాలని, భావిస్తున్నారు. మొత్తంగా యరపతినేనికి వ్యతిరేకంగా 24 మంది సాక్షులు సాక్ష్యం చెప్పడం చూస్తుంటే…అక్రమ మైనింగ్ భారీగా జరిగిందని అర్థమవుతుంది. దీన్ని బట్టి యరపతినేని ఈ కేసులో పూర్తిగా కూరుకుపోయారని, ఆయన దోషిగా జైలుకు పోవడం ఖాయమని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ .జరుగుతోంది. యరపతినేని తర్వాత జైలుకు పోయేది తమ నేతే అంటూ కోడెల, సోమిరెడ్డి, కరణం బలరాం, కూన రవికుమార్, పత్తిపాటి పుల్లారావు వంటి టీడీపీ నేతల అనుచరుల్లో భయాందోళన వ్యక్తం అవుతుంది. మరి యరపతినేని తర్వాత ఏ టీడీపీ నేత జైలుకు పోతాడో చూడాలి.