గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రజలు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించిన విషయం తెలిసిందే. అప్పటి అధికార పార్టీ టీడీపీ ని దారుణంగా ఓడించారు. 2014 ఎన్నికల్లో ప్రజలకు మాయమాటలు చెప్పి, రైతులను ఆశపెట్టి చివరకు గెలిచిన తరువాత వారిని నట్టేటిలో ముంచేశారు. ఐదేళ్ళు అధికారంలో ఉన్న చంద్రబాబు ఏ ఒక్క పని కూడా సక్రమంగా నిర్వతించలేకపోయారు. ప్రభుత్వాన్ని సొంత ప్రయోజనాలకే వాడుకున్నారు. ఇదేంటయ్య అని ప్రశ్నించిన వారిని పోలీసులతో కొట్టించేవారు. అలాంటి వ్యక్తి మల్లా ఎన్నికలు దగ్గరపడే సమయానికి ప్రజలకు డబ్బు చూపించి ఓట్లు కొనుక్కోవాలి అనుకున్నాడు. ఈసారి మాత్రం ప్రజలు మోసపోలేదు. ఇక అసలు విషయానికి వస్తే ఎన్నికలకు ముందు పాదయాత్రలో జగన్ ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీ అధికారంలోకి వచ్చినాక అమలు చేస్తానని అన్నారు. దీనికి తగ్గట్టుగానే ముందుకు వెళ్తున్న విషయం తెలిసిందే. అదేవిధంగా నిరుద్యోగులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉద్యోగాలు కూడా తీసాడు. దీనిపై స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ కోసం 4 లక్షలకు పైగా ఉద్యోగాలు సృష్టిస్తే ప్రశంసించే పెద్ద మనసు లేదు. రిక్షాలు తొక్కాలని, హమాలీ పని చేయాలి అంటూ నిరుద్యోగులను బెదరగొట్టిన పాపం ఊరికే పోదు చంద్రబాబు గారూ అని ఆయన అన్నారు.ఈ ఐదేళ్లలో ఇంకా చాలా చూస్తారు.గుండె రాయి చేసుకోండి అని ట్వీట్ చేసారు.
గ్రామ సచివాలయాలు,వలంటీర్ల వ్యవస్థ కోసం 4 లక్షలకు పైగా ఉద్యోగాలు సృష్టిస్తే ప్రశంసించే పెద్ద మనసు లేదు.రిక్షాలు తొక్కాలని,హమాలీ పని చేయాలి అంటూ నిరుద్యోగులను బెదరగొట్టిన పాపం ఊరికే పోదు @ncbn గారూ.ఈ ఐదేళ్లలో ఇంకా చాలా చూస్తారు.గుండె రాయి చేసుకోండి. @naralokesh @JaiTDP @YSRCParty
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 30, 2019