ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు.. పార్టీ నేతలు భారీగా చేరుతున్నారు. గడిచిన ఎన్నికల్లో అత్యంత దారుణంగా ఓడిపోయిన తెలుగుదేశం పార్టీలో ఉంటే ఇక మాకు రాజకీయ భవిష్యత్ ఉండదని మరో 20 ఏళ్లు వైసీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ నే ఉండబోతున్నారని తెలుసుకోని వైసీపీలో చేరుతన్నట్లు సమచారం. తాజాగా విశాఖ డెయిరీ చైర్మన్ తులసీరావు కొడుకు ఆనంద్ వైసీపీలో చేరుతున్నారని సమచారం. గడిచిన ఎన్నికల్లో అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆనంద్ పోటీ చేసి ఓడిపోయారు. ఈ నేపథ్యంలోనే ఆనంద్ పార్టీ మార్పు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తులసీరావు కుమార్తె, ఎలమంచిలి మునిసిపల్ మాజీ చైర్‌పర్సన్ పిళ్లా రమాకుమారి కూడా తన సోదరుడి బాటలోనే నడవనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబరు 1న విజయవాడలో సీఎం జగన్ సమక్షంలో వీరు వైసీపీలో చేరుతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు… ఆనంద్‌ను బుజ్జగించే బాధ్యతను మాజీ మంత్రి అయ్యన్నకు అప్పగించినట్టు తెలిసింది. మరోపక్క టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన వరుపుల రాజా టీడీపీకి గుడ్‌బై చెప్పారు. టీడీపీలో కాపులకు సరైన గుర్తింపు లేదని, ఒక సామాజిక వర్గానికే కొమ్ము కాస్తూ, వారి చేతుల్లోనే పార్టీ నడుస్తోందని విమర్శించారు. కాపుల రిజర్వేషన్‌పై జగన్ మొదటి నుంచీ ఒకే స్టాండ్‌తో ఉన్నారని చెప్పారు. ఏ పార్టీలోకి వెళ్లేదీ కేడర్‌తో సంప్రదించాకే ప్రకటిస్తానని రాజా తెలిపారు. మరో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బీజేపీలోకి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఏది ఎమైన ఎన్నికలు ముగిసి 3 నెలలు అయ్యోసరికి టీడీపీని పదులుసంఖ్యలో
వీడారు. మరి వచ్చే ఎన్నికల్లో ఏపీ తెలుగుదేశం పార్టీ ఖాళీ అయ్యోలాగా ఉన్నట్లు ఉంది .
