మరో కొద్ది రోజుల్లో టీటీడీ బోర్డ్ పూర్తి స్థాయిలో కొలువు దీరనుంది. ఇప్పటికే టీటీడీ బోర్డ్ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా టీటీడీ బోర్డ్ సభ్యుల నియామకం దాదాపుగా ఓ కొలిక్కి వచ్చింది. ఈసారి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీడీ బోర్డు మెంబర్ పదవి కోసం చాలా మంది ఆశావహులు ఎదురుచూస్తున్నారు. దీంతో టీటీడీ బోర్డ్ మెంబర్స్ సంఖ్యను 25కు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్్ణు జారీ చేసింది. గవర్నర్ దగ్గరికి ఈ రోజు టీటీడీ బోర్డ్ మెంబర్స్‌కు సంబంధించిన ఫైల్ వెళ్లనుంది. మరో 5 రోజుల్లో అనగా సెప్టెంబర్ 4 న టీటీడీ బోర్డ్ మెంబర్స్ లిస్ట్‌ను అధికారికంగా ప్రకటిస్తారు.
టీటీడీ బోర్డులో రాష్ట్రాలు, వివిధ వర్గాల వారీగా ప్రాధాన్యం
* తెలంగాణకు – 3 లేదా 4
* కర్ణాటకకు – 1
* తమిళనాడు – 2
* మహారాష్ట్ర – 1
* అమిత్‌షా – 1
* విశాఖ శారదాపీఠం – 1
* తిరుపతి ఎమ్మెల్యే – 1
* ఎక్స్‌అఫీషియో మెంబర్ – 1
* టీటీడీ ఛైర్మన్ – 1
* టీటీడీ ఈవో – 1
* స్పెషల్ ఆఫీసర్ – 1
టీటీడీ ఛైర్మన్, ఈవో, స్పెషల్ ఆఫీసర్ కాక మిగళావాళ్లందరూ సభ్యులు. కాగా టీటీడీ బోర్డు మెంబర్స్ కాలపరిమితి 2 సంవత్సరాలు. మొత్తంగా టీటీడీ బోర్డు మెంబర్ పదవులపై పలు ఊహాగానాలు తలెత్తుతున్నాయి. టీటీడీ బోర్డు సభ్యులు వీరే అంటూ పలువురి ప్రముఖల పేర్లపై మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మొత్తంగా సీఎం జగన్ ఎవరెవరికి టీటీడీ బోర్డు పదవి కట్టబెట్టారో తెలియాల్సిందే 4 వ తారీఖు వరకు ఆగాల్సిందే.