చిత్రం: సాహో
నటీనటులు: ప్రభాస్, శ్రద్ధ కపూర్, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేశ్, అరుణ్ విజయ్, మందిరా బేడీ తదితరులు
సంగీతం: తనిష్క్ బగ్చీ, గురు రాంద్వా, బాద్‌షా, జిబ్రాన్ (నేపథ్యం)
కథ, దర్శకత్వం: సుజీత్
నిర్మాణం: యూవీ క్రియేషన్స్, టీ సిరీస్
విడుదల తేదీ: 30-08-2019
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సాహో చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సుమారు ₹300 కోట్లతో తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో తెరకెక్కించారు. మరి ఇంత భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ యాక్షన్ మూవీ హిట్ అయ్యిందో లేదో చూద్దాం.
ఇక కధ విషయానికి వస్తే ఈ సాహో స్టొరీ వాజీ సిటీలో మొదలవుతుంది. ఇందులో పృధ్విరాజ్ (టిను ఆనంద్) తన కొడుకు దేవరాజ్(చుంకీపాండే)ను అండర్ వరల్డ్ సామ్రాజ్యానికి కింగ్ ని చెయ్యాలనుకుంటాడు. పృధ్విరాజ్ రాయ్ అనే వ్యక్తిని చేరదీస్తాడు.. అయితే రాయ్ తన పేరుతో క్రైమ్ నడిపిస్తాడు. దాంతో రాయ్ పై పృధ్విరాజ్ పగ పంచుకుంటాడు. అనుకోకుండా ఒకరోజు రాయ్ తన సొంత ఊరు ముంబై వెళ్తాడు. అక్కడ అనుమానాస్పదంగా ఆక్సిడెంట్ లో చనిపోతాడు. ఇదే సమయంలో రెండు లక్షల కోట్లతో వస్తున్న షిప్ పేలిపోతుంది. దీంతో రాయ్ కొడుకు విశ్వక్ ఈ సామ్రాజ్యానికి వారసుడుగా వస్తాడు. ఇది ఇలా ఉంటే మరోపక్క ముంబై లో రెండు వేల కోట్లు దొంగతనం జరుగుతుంది. ఈ కేసుని హేండిల్ చెయ్యడానికి ప్రభాస్ (అశోక్ చక్రవత్తి)గా వస్తాడు. క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ గా శ్రద్ధా కపూర్ (అమృతా నాయర్) ఈ కేసుని టేక్ అప్ చేస్తుంది. ఈ క్రమంలోనే వీరిద్దరూ ప్రేమలో పడతారు. రాయ్ ని ఎవరు చంపారు. ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయ్ అనేదే ఈ స్టొరీ.
ఇక సినిమా ఎలా ఉంది అనే విషయానికి వస్తే..ప్రస్తుత రోజుల్లో అందరు ఎక్కువగా యాక్షన్ సీన్లు, ట్విస్టులు ఉన్నవే ఇష్టపడుతున్నారు. అయితే దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని హాలీవుడ్ లెవెల్ లో తీసాడు. ఈ చిత్రం మొదటి నుండి ఆఖరి వరకు గ్యాంగ్‌స్టర్లు, తుపాకులు, బాంబులు, ఛేజ్‌లతోనే ఉంటుంది. అయితే భారీ అంచనాలు పెట్టుకున్న ఈ చిత్రం మరీ బాలేదని చెప్పలేం అలాగని సూపర్ హిట్ అని కూడా చెప్పలేం.
బలాలు:
*ప్రభాస్
* యాక్షన్ సీన్లు, ట్విస్టులు
బలహీనతలు:
*సాంగ్స్
*కామెడీ
*స్క్రీన్ ప్లే
రేటింగ్: 2.3/5