వైసీపీ ప్రభుత్వం రాజధానిని అమరావతి నుంచి తరలిస్తుందంటూ కొద్ది రోజులుగా చంద్రబాబుతో సహా, టీడీపీ నేతలు రచ్చ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం అమరావతి నుంచి రాజధానిని తరలించేందుకు సుముఖంగా లేదు..అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూనే…ఏపీలో అభివృద్ది కేంద్రీకరణ దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. అమరావతికి వరద ముంపు నేపథ్యంలో రాజధాని నిర్మాణానికి ఖర్చు రెట్టింపు అవుతుందన్న మంత్రి బొత్స వ్యాఖ్యలను వక్రీకరిస్తూ చంద్రబాబు, టీడీపీ నేతలు అమరావతి తరలిపోతుందంటూ రాజధాని రైతులను రెచ్చగొతున్నారు. అయినా పెద్దగా స్పందన లేకపోవడంతో చంద్రబాబు తన పార్టనర్ పవన్ కల్యాణ్ ను ఈ వ్యవహారంలోకి దించాడు.
తాజాగా బాబు గారి పార్టనర్, జనసేన అధ్యక్షుడు రాజధాని విషయంలో ఎంటర్ అయ్యాడు. రెండు రోజుల పర్యటనలో భాగంగా అమరావతి గ్రామాల్లో రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చి న రైతులతో మాట్లాడుతూ సాగుతున్నాడు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ. ఏపీ రాజధానిపై రాజకీయాలు చేయద్దని అన్నారు. రాజధాని ప్రాంత రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించాడు.. రాజధాని విషయంలో అవసరమైతే ప్రధాని మోడీని, హోంమంత్రి అమిత్ షాలను కలుస్తామని అన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ పరిస్థితులను అర్ధం చేసుకుని వ్యాఖ్యలు చేస్తే బాగుంటుందని పవన్ అన్నారు. దీంతో నెట్‌జన్లు పవన్‌పై కౌంటర్లు ఇస్తున్నారు. ఏంటీ అమరావతిపై రాజకీయాలు చేస్తుంది..మీరు, మీ పార్టనర్ చంద్రబాబా అంటూ నెట్‌జన్లు ప్రశ్నిస్తున్నారు. రాజధానిపై అమిత్‌షాను, మోదీని కలుస్తారా..మరి అప్పుడెప్పుడులో 2015లో చంద్రబాబును కలిసి వచ్చాకా..ప్రత్యేక హోదా మీ కేంద్రాన్ని ప్రశ్నించరా అని ఓ విలేకరి అడిగితే ఏం చెప్పారో గుర్తుందా… “నాకు కేంద్రం తో మాట్లాడే స్థాయి లేదు అన్నారు. ఇప్పుడు జగన్ తన మాట వినకపోతే కేంద్రం ని అడుగుతా అంటున్నారు. అప్పుడు లేని స్థాయి ఇప్పుడు ఎలా వచ్చింది…అంతా మీ పార్టనర్ బాబుగారి మహత్యమా..అంటూ నెట్‌జన్లు జనసేనానిపై కౌంటర్లు ఇస్తున్నారు.