తెలుగుదేశం పార్టీపై బీజేపీ నేత మాణిక్యాలరావు విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి నూకలు దగ్గర పడ్డాయని, మరో మూడు నెలల్లో ఆ పార్టీ శాశ్వతంగా మూతపడుతుందని జోస్యం చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్ల పరిపాలనలో ఒక్క శాశ్వత భవనం కూడా నిర్మించలేదని అన్నారు. రాజధాని మార్పు విషయంలో రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి నెలకొందని, వైసీపీ ప్రభుత్వం ఇప్పటికైనా రాజధాని మార్పుపై స్పష్టత నివ్వాలని కోరారు.
