వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి చంద్రబాబు అండ్ పచ్చ గ్యాంగ్ కు నోట మాట రావడంలేదు. టీడీపీ అధికారంలో ఉన్నతసేపు వారు ఆడిందే ఆట..పాడిందే పాటగా సాగింది. జగన్ సీఎం గా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుండి అతడిని ఎదుర్కోడానికి నానా తంటాలు పడుతున్నారు. ఇంకేం చెయ్యాలో తెలియక చివరికి జగన్ పై దొంగ ప్రచారాలు మొదలుపెట్టారు. అందులో కూడా అడ్డంగా దొరికిపోయి పరువు మొత్తం తీసుకుంటున్నారు. గడిచిన మూడు నెలల్లో చంద్రబాబు అండ్ కో చేసిన దొంగ ప్రచారాలు ఏంటో ఒకసారి చూద్దాం..
1.తిరుమల టికెట్ల వెనక అన్యమత ప్రచారమంటూ మొదలెట్టారు, నిజం బయటపడి పరువు పోగొట్టుకున్నారు.
2.తిరుమల కొండల్లో చర్చి కడుతున్నారు అంటూ మొదలెట్టారు, నిజం బయట పడి పరువు పోగొట్టుకున్నారు.
3.శ్రీశైలం దేవస్థానంలో అన్య మతస్తులంటూ ప్రచారం చేసి, చివరికి నిజం బయట పడడంతో పరువు పోగొట్టుకున్నారు.
4.కరకట్ట కింద కొంప అక్రమం కాదు, సక్రమమంటూ వాదించన పచ్చ గ్యాంగ్. మొన్నటి వరదలతో అది అక్రమమని తేలడంతో ఉన్న కాస్త పరువు పోగొట్టుకున్నారు.
5.రైతులకి వరద సహాయం అందలేదంటూ నాటకాలు మొదలెట్టారు. వారు రైతులు కాదు జూనియర్ ఆర్టిస్ట్ లని తేలడంతో అడ్డంగా దొరికిపోయారు
6.అసెంబ్లీ దేవాలయం, అందులో కోడెల దేవుడని మొదలెట్టారు. చివరికి కోడెల ఫర్నీచర్ దొంగతనంతో దేవుడు కాస్తా ఏమయ్యాడో రాష్ట్ర ప్రజలు మొత్తం తెలుసుకున్నారు.
7.యరపతినేని మైనింగ్ డాన్ కాదు. కేవలం మట్టిని తవ్వుకున్నాడని మొదలెట్టారు. కాని హైకోర్ట్ ఇచ్చిన తీర్పుతో అందరి పరువు పోగొట్టుకున్నారు.
8.ధర్మ పోరాట దీక్షలకి టీటీడీ సొమ్ము వాడుకోలేదని వాదించారు. ఢిల్లీ ఉదంతంతో పరువు మొత్తం పోగొట్టుకున్నారు.
9.రైతులకి విత్తనాలు ఇవ్వలేదని అంటున్నారు. పాపం శనగ మరియు వరి విత్తనాలకీ తేడా తెలీక పరువు పోగొట్టుకున్నారు.
10.అమెరికాలో జగన్ జ్యోతి వెలిగించలేదని మొదలెట్టారు. ఫైర్ రిస్ట్రిక్ట్ జోన్ అని బయట పడడంతో పరువు పోగొట్టుకున్నారు.
11.డ్రోన్ ల గురించి మొదలెట్టారు. గతంలో వైఎస్ ఎస్టేట్ పై వారు చేసిన “రాజ కోట” రహస్య విహంగ వీక్షణ చిత్రాలు బయట పడడంతో మూలన కూర్చున్నారు.
12.జాబులివ్వలేదంటూ మొదలెట్టారు. 4,15,000 ఉద్యోగాలు భర్తీ చేయడంతో ఒక్కసారిగా కంగుతిన్నారు.
13.వేస్ట్ సీఎం అంటూ పచ్చ గ్యాంగ్ రాద్ధాంతం చేసారు.కాని రెండు నెలల్లోనే దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రిగా మూడో స్థానంలో నిలవడంతో చంద్రబాబు బుర్ర పాడు చేసుకున్నారు.
14.శ్రీశైలం జలాశయం ఫోటోలను టిట్టర్ లో పెట్టి ఇదే మా చంద్రన్న పట్టిసీమ అన్నారు. నిజం బయటపడేసరికి పచ్చ గ్యాంగ్ నెమ్మదిగా పక్కకి తప్పుకున్నారు.
15.రామాయపట్నం పోర్ట్ కి శంఖుస్థాపన చేశామన్నారు. చంద్రబాబు, తన బినామీ నయవగలే పోర్ట్ ని అడ్డుకున్నారని నిజం బయటపడడంతో మొత్తం పరువు పోయింది.
16.మద్య నిషేధం పై ఏవేవో మాటలు అన్నారు. ఒక్కసారిగా 48000 బెల్ట్ షాపులు, 800 మద్యం షాపులు మూసేయడంతో నోటంట మాటలు రావడంలేదు.
17.జీతాలివ్వట్లేదని మొదలెట్టారు హల్ చల్ చేసారు. అది రిజర్వ్ బ్యాంక్ లో టెక్నికల్ ఇష్యూ అని తేలడంతో మరోసారి పరువు పోగొట్టుకున్నారు.
18.ప్రపంచ బ్యాంక్ రుణం ఎగ్గొట్టిందంటూ మొదలెట్టారు. దానికి కారణం చంద్రబాబు తీసుకున్న పర్యావరణ వ్యతిరేక నిర్ణయాలే అని బయటపడడంతో పరువు పోగొట్టుకున్నారు.
19.కియా మా చంద్రన్న మానస పుత్రిక అని మొదలెట్టారు. కియా మోటార్స్ సీఈఓ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గారికి రాసిన లెటర్ బయట పడడంతో అందరి ముందు తలదించుకున్నారు.
20.సున్నా వడ్డీకే అర్హులందరికీ రుణాలిచ్చేశామన్నారు. అసెంబ్లీ సాక్షిగా వారి చేతనే జగన్ నిజాలు బయట పెట్టించడంతో అసెంబ్లీ సాక్షిగా పరువు పోగొట్టుకున్నారు.
21.గ్రామ వాలంటీర్ పోస్టులు ఇవ్వొద్దంటూ హైకోర్ట్ లో తన లాయర్ దుమ్మలపాటి శ్రీధర్ ద్వారా కేసు వేయించారు. హైకోర్ట్ లో వారిని వెళ్ళి పనిచుస్కోండి అని చెప్పడంతో పరువు పోగొట్టుకున్నారు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మూడు నెలల్లో చాలానే ఉన్నాయి. ప్రజలు ఇంత బుద్ధి చెప్పిన వారిలో ఇంక మార్పు రాదనే చెప్పాలి.