పశ్చిమగోదావరి జిల్లా దెందలూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై… ఆయన అనుచరులపై… ఎస్సీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తమ ఇంటికి దగ్గరలో ఉన్న మట్టి తీసుకెళ్తున్న ఎస్సీలపై… “తాను తప్ప ఎవరూ మట్టి తోలేందుకు వీలు లేదని” అడ్డు చెప్పిన చింతమనేని… ఎందుకు తీసుకెళ్లకూడదని ప్రశ్నించిన ఎస్సీలపై దాడి చేసి… కులంపేరుతో అడ్డమైన తిట్లూ తిట్టారని కేసు నమోదైంది. బాధితులు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు రాసినట్లు పోలీసులు స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్‌లో ఎస్సీలు ఆందోళన చేశారు. వెంటనే చింతమనేని ప్రభాకర్‌నీ, ఆయన అనుచరులనూ అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేశారు. వ్యవహారం ముదరటంతో ఏ క్షణమైనా తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని భావించిన చింతమనేని ప్రభాకర్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలిసింది.
