టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ కీసర ఫారెస్టు బ్లాక్‌లోని 2,042 ఎకరాలను దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. తన ఎంపీ నిధులతో ఈ అర్బన్ ఫారెస్ట్‌ను ఎంపీ నిధులతో ఎకో టూరిజం పార్కుగా అభివృద్ధి చేసేందుకు సంతోష్‌కుమార్ సమాయాత్తం అయ్యారు. రేపు అనగా ఆగస్టు 31 న ఈ అర్బన్ ఫారెస్ట్‌లో ఎకో పార్క్ అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎంపీ సంతోష్‌కుమార్ హాజరవుతున్నారు. ఈ రిజర్వ్ ఫారెస్టులో హరితహారంలో భాగంగా 15 వేల మొక్కలు నాటేందుకు అటవీ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందు కోసం మొత్తం 15 స్థలాలు ఎంపిక చేశారు. దత్తత తీసుకున్న పీ సంతోష్‌కుమార్ తన ఎంపీ నిధులతో ఎకో పార్క్ డెవలప్‌మెంట్ చేయనున్నారు.
