వరల్డ్ ఛాంపియన్ షిప్ లో బ్రాంజ్ మెడలిస్ట్, అర్జున అవార్డులు దక్కించుకున్న సాయి ప్రణీత్ ను గవర్నర్ నరసింహన్ దంపతులు ఘనంగా సన్మానించారు. రాజ్ భవన్ లోని ధర్బార్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో.. కోచ్ పుల్లెల గోపిచంద్ తో పాటు సాయి ప్రణీత్ సపోర్టింగ్ స్టాఫ్ హాజరయ్యారు. భవిష్యత్ లో సాయి ప్రణీత్ మరిన్ని విజయాలు సాధించాలని గవర్నర్ ఆకాంక్షించారు. వచ్చే ఒలింపిక్స్ లో మెడల్ సాధించి రాష్ట్రానికి, దేశానికి గర్వకారణంగా నిలువాలన్నారు గవర్నర్ ఆకాంక్షించారు. 36 ఏళ్ల తర్వాత ఈ విభాగంలో కాంస్య పథకం సాధించడం రాష్ట్రానికే గర్వకారణమని కొనియాడారు.
Am really blessed and honoured to be felicitated by our governor shri Narasimhan Sir…. thank you Sir for your blessing ? pic.twitter.com/ilFjpAE29g
— Sai Praneeth (@saiprneeth92) August 30, 2019