ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ సునామీకి తెలుగుదేశం పార్టీ కంచుకోటలు బద్దలయ్యాయి. ఆ పార్టీలో హేమాహేమీల్లాంటి నాయకుల వారసులు జగన్ హవాతో కొట్టుకుపోయారు. కర్నూలు జిల్లాలో నాలుగు దశాబ్దాలుగా తిరుగులేని రాజకీయ కుటుంబంగా కొనసాగుతున్న కేఈ కుటుంబానికి సైతం ఈ ఎన్నికల్లో దారుణ పరాభవం ఎదురైంది. మాజీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యాంబాబు మొదటి ఎన్నకలోనే పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఆయనపై వైసీపీ మొట్ట మొదటి అభ్యర్థి కంగాటి శ్రీదేవి 42 వేలకు పైగా భారీ మెజారిటీతో శ్యాంబాబుపై విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీకి తిరుగులేదనుకున్న ఈ నియోజకవర్గంలో ఆమె కేఈ వారసుడిని ఓడించి రికార్డు సృష్టించారు. అయితే పత్తికొండ వైసీపీ సమన్వయకర్త చెరుకులపాడు నారాయణ రెడ్డి, ఆయన డ్రైవర్ సాంబశివుడు హత్య కేసులో కేయి శ్యాంబాబును నిందితులుగా చేర్చాలంటూ 2017లో నారాయణ రెడ్డి భార్య చెరుకులపాడు శ్రీదేవి డోన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు కేఈ శ్యాంబాబు, నాగ తులసీ ప్రసాద్‌లను అరెస్ట్ చేయాలంటూ అప్పట్లో కోర్టు ఆదేశాలు జారీ కూడ చేసింది. తాజాగా పత్తికొండ వైసీపీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఓ యూట్యూబ్ చానెళ్లుకు ఇచ్చిన ఇంటర్వూలో సంచలన వాఖ్యలు చేశారు. నా భర్త చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్య కేసులో ఉన్నకేయి శ్యాంబాబును..వారికి సహకరంచిన వారిని వదిలే ప్రసక్తే లేదు ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తాం అన్నారు. దీంతో మరోసారి కర్నూల్ జిల్లా రాజకీయాల్లో చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్య హట్ టాపిక్ గా మారనుంది.