మెగాస్టార్ చిరంజీవి నటించిన 151వ మూవీ ‘సైరా నరసింహారెడ్డి’. ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. సైరాను కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌లో రామ్ చరణ్ భారీ ఎత్తున తెరకెక్కించాడు. దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. అయితే ఈ సినిమాకు సంబంధించి చిరంజీవి కోసం అన్ని భాషల అగ్ర నాయకులు రంగంలోకి దిగారు. ఏదో విధంగా చాలామంది ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. ‘సైరా’లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువుగా గోసాయి వెంకన్న పాత్రలో నటిస్తున్నారు. అలాగే సౌతిండియా లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా, తమన్నా నర్తకి పాత్రలో నటిస్తోంది. సైరాను తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళ,కన్నడ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న విడుదల చెయ్యాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. దీంతో మెగా ఫ్యాన్స్ అందరు ఆనందంలో తేలుతున్నారు. కాని ఇక్కడే ఫ్యాన్స్ కు మింగుడు పడని వార్త ఒకటి ఉంది. ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది కాబట్టి అక్టోబర్ 2న హృతిక్ రోషన్ చిత్రం ‘వార్’ కూడా అదేరోజున రిలీజ్ అవుతుండడంతో రెండు సినిమాలు ఒకేరోజున విడుదలైతే ఇబ్బంది అని అలోచించి సైరా ను వేరే డేట్ కు మార్చనున్నారని సమాచారం.