ఏపీలో ప్రతిపక్ష టీడీపీ సోషల్ మీడియా టీమ్ గత కొద్ది రోజులుగా పెయిడ్ ఆర్టిస్టులను వివిధ వర్గాల ప్రజలుగా వేషం కట్టించి…సీఎం జగన్,, వైసీపీ మంత్రులను కించపరుస్తూ పలు వీడియోలు రిలీజ్ చేస్తోంది. కొద్ది రోజుల క్రితం రైతు వేషంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను కులంపేరుతో దూషించిన కేసులో శేఖర్ చౌదరిని.. పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.తాజాగా ముఖ్యమంత్రి గారి పై అసభ్యకరమైన పోస్టులు పెట్టి నవీన్ కుమార్ అనే వ్యక్తి అరెస్ట్ అయ్యాడు . అయితే ఇతను టీడీపీ నాయకుల సాయంతో రాష్ట్రం నుండి పారిపోయి పక్క రాష్ట్రాల్లో దాక్కున్నట్లు వార్తలు వస్తున్నాయి. రోజుకొక సిమ్ మారుస్తూ పోలీసులకు సవాలు విసిరిన ఇతడిని సైబర్ పోలీసులు మూడు రాష్ట్రాలను జల్లెడ పట్టి అరెస్ట్ చేశారు. చట్టపరంగా ఇతడిని కఠినంగా శిక్షించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు పోలీసులుతెలియజేసారు . అంతేకాదు ఇక మీదట మంత్రులు కానీ, ఎమ్మెల్యేలపై కానీ, ముఖ్యమంత్రి గారిపై కానీ ఎవరు ఎటువంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టినా వారు ఎక్కడ ఉన్నా, ప్రజాసామ్య పద్దతిలో అరెస్టు చేసి ఇదేవిధంగా కఠినంగా శిక్షిస్తామని తెలియచేస్తూన్నారు వైసీపీ నేతలు. అయితే వైసీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయడం వెనుక టీడీపీ సోషల్ మీడియా కుట్ర ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు ఈ కేసుపై కూలంకుశంగా విచారణ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ వ్యవహారం మొత్తం టీడీపీ సోషల్ మీడియా లోకేష్ సారథ్యంలో నడుస్తోంది. దీంతో ఈ కేసులో లోకేష్ ప్రమేయంపై పూర్తి ఆధారాలను సేకరించిందేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. దీంతో ఈ కేసులో లోకేష్ పాత్ర బయటపడే అవకాశం ఉందని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.