వైసీపీ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే మరియు ఒక ఎంపీకి పెద్ద పెను ప్రమాదం తప్పింది. కర్నూలు జిల్లా ఆత్మకూరులో సిద్ధాపురం ఎత్తిపోతల పథకానికి నీటిని విడుదల చేసేందుకు వైసీపీ ఎమ్మెల్యే శిల్పచక్రపాణి రెడ్డి ,ఆర్థర్, ఎంపీ బ్రహ్మానందరెడ్డి మరియు నేతలు , కార్యకర్తలు వెళ్లారు. ప్రారంభించేందుకు నంద్యాల ఎంపీ పోచాల బ్రహ్మానందరెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ వెళ్లారు. కాగా సిద్దాపురం లిప్టును ప్రారంభించి గంగమ్మకు పూజలు చేస్తుండగా లిఫ్ట్ ఇరిగేషన్ పైపుల్లో ఎయిర్ లాక్ కావడంతో అకస్మాత్తుగా ఒక్కసారి అందులోని నీరు అంత కూడా పైకినీళ్లు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. దీంతో నేతలు, కార్యకర్తలు పరుగులు తీశారు. ఈ సంఘటనతో భయాందోళనకు గురైనటువంటి ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, రైతులు, మీడియా ప్రతినిధులు అందరు కూడా అక్కడినుండి పరుగులు తీశారు. కొద్దిసేపటి తరువాత కొద్దిక్షణాల్లోనే తీవ్రమైన ఉదృతిని సృష్టించింది. వేంటనే వాటర్ ప్రెజర్ తగ్గిపోవడంతో నేతలు ఊపిరి పీల్చుకున్నారు.
