నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 105వ చిత్రం రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన బాలకృష్ణ న్యూ లుక్ డిఫరెంట్‌గా ఉందని అందరూ అప్రిషియేట్ చేశారు. అలాగే ఇటీవల థాయ్‌లాండ్‌లో ఈ సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయ్యింది. చిత్ర నటీనటులందరూ పాల్గొనగా.. 20 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్‌లో రెండు పాటలు, కొంత టాకీపార్ట్, భారీ యాక్షన్ ఏపిసోడ్‌ను షూట్ చేశారు. సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి సి.రామ్‌ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
నటీనటులు:
నందమూరి బాలకృష్ణ
సోనాల్ చౌహాన్
వేదిక
ప్రకాశ్ రాజ్
భూమిక చావ్లా
జయసుధ
షాయాజీ షిండే
నాగినీడు
సప్తగిరి
శ్రీనివాస్‌రెడ్డి
రఘుబాబు
ధన్‌రాజ్ తదితరులు
సాంకేతిక నిపుణులు:
దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్
నిర్మాత: సి.కల్యాణ్
కో ప్రొడ్యూసర్స్: సి.వి.రావ్, పత్సా నాగరాజు
కథ: పరుచూరి మురళి
మ్యూజిక్: చిరంతన్ భట్
సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్
ఆర్ట్: చిన్నా
పాటలు: రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల
ఫైట్స్: రామ్ లక్ష్మణ్
కొరియోగ్రఫీ: జానీ మాస్టర్