Home / TELANGANA / మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొంటాం.. కేటీఆర్

మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొంటాం.. కేటీఆర్

మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘనవిజయం సాధిస్తుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. పురపాలక ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొంటామని, ఎన్నికలకు పార్టీ పరమైన కసరత్తు ప్రారంభించినమని కేటీఆర్ అన్నారు.తెలంగాణ భవన్ లో పార్టీ ప్రధాన కార్యదర్శులతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. సుమారు 5 గంటల పాటు సుదీర్ఘంగా ఈ సమావేశం కొనసాగింది. మున్సిపల్ ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించారు. ఒక్కో మున్సిపాలిటీ వారీగా సమీక్ష నిర్వహించారు. మొత్తం 141 మున్సిపాల్టీలపై సమీక్ష నిర్వహించారు. ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ నెల 31లోపు బూత్, డివిజన్, గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. కమిటీల ఏర్పాటు తర్వాత శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాల నిర్మాణాల పర్యవేక్షణకు నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, పల్లారాజేశ్వర్ రెడ్డి, శ్రవణ్ కుమార్ రెడ్డితో కమిటీ ఏర్పాటు చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat