ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సాహో చిత్రం మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించి ఆగష్టు 18న హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా అంగరంగ వైభవంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించారు. వాస్తవానికి ఈ సినిమాను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న విడుదల చెయ్యాలని భావించగా కొన్ని కారణాల వల్ల ఈ నెల 30కి ఫైనల్ చేసారు. ప్రస్తుతం ప్రభాస్ చిత్ర ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. ఈ సమయంలోనే మీడియాతో మాట్లాడిన ప్రభాస్ పరీక్షకు ముందురోజు స్టూడెంట్ ఎంత బయపదతాడో అందరికి తెలిసిందే కొంతమందికి నిద్ర కూడా రాదు అలానే..నా సినిమా రిలీజ్ కు ముందురోజు నాకు నిద్ర పట్టాడు ఎందుకంటే ఆ చిత్రం హిట్ అవుతుందో లేదో అని కొంచెం టెన్షన్ ఉంటుందని అన్నాడు. అంతేకాకుండా ”నేనైతే అభిమానులను కొట్టలేను, తొయ్యలేను.. నాకు రక్షణగా ఉన్న బౌన్సర్స్ వారిపై చెయ్యి వెయ్యడానికి ప్రయత్నించినా నాకు ఏదోలా ఉంటుంది. నాకు ఒక్క ఫ్యాన్ వస్తే చాలు అనుకున్నా కానీ ఇపుడు ఇంతమంది ఫ్యాన్స్ ఉండటం అంటే హ్యాపీనే కదా.. అన్నారు. ఎలాగూ నేను బయట కనిపించేది తక్కువ.. కనిపించినపుడు అభిమానం చూపిస్తారు. అది తనకు ఇష్టమే”నని పేర్కొన్నారు.