అన్నివర్గాలు, జాతులు, మతాలకు చెందిన అందరి సంక్షేమమే ధ్యేయంగా పథకాలను ప్రకటించి చిత్తశుద్ధితో అమలు చేసేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ శ్రీకారం చుట్టారు. సంక్షేమ యుగ సృష్టికర్తగా మారి పధకాలను అందిస్తున్నారు. అయితే జగన్ ప్రభుత్వంపై కనీసం మూడు నెలలైనా గడవకముందే టీడీపీ విష ప్రచారం చేస్తోంది. ముఖ్యంగా ఇసుకపై ప్రతిపక్షం సృష్టించిన వివాదం అంతా ఇంతా కాదు.. అయితే దీనిపైనా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. సెంప్టెంబర్ 5వ నుంచి కొత్తఇసుక పాలసీ అమల్లోకి రానుంది. మార్కెట్ లో కంటే చౌకరేటుకే ఇసుక అందుబాటులోకి తీసుకువస్తు్ననారు. ఇసుక సప్లై పెంచి, కొరత లేకుండా చూడనున్నారు. అలాగే ఇసుక రీచ్ లను పెంచి, స్టాక్ యార్డుల్లో ఇసుక నింపడం వంటివి మొదలు పెడుతున్నారు. రవాణా సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.. ప్రధానంగా కనిపించే మరో సమస్య భూ వివాదాలు. ఇందుకోసం ప్రతి మంగళవారం కలెక్టర్లు, ఎస్సీలు కలిసి భూవివాదాలకు చెందిన జాబితాలు ఇచ్చిపుచ్చుకోవాలని ఆదేశించారు.
ఈ జాబితాలు తహశీల్దారుకు పంపుతారు. ప్రతీగురువారం తహశీల్దార్, ఎస్సై, ఆర్‌ఐ, సర్వేయర్, వీఆర్వోలంతా కలిసి సదరు భూవివాదాలు పరిష్కరిస్తారు. అగ్రిగోల్డ్ బాధితులకు సెప్టెంబర్ నుండి డబ్బులు ఇస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే రూ.1150 కోట్లు కేటాయించారు. గ్రామవాలంటీర్ల ద్వారా అగ్రిగోల్డు బాధితులకు రసీదులు అందించి, అగ్రిగోల్డు ఆస్తులను స్వాధీనం చేసుకుని, తర్వాత వేలం ద్వారా రికవరీ చేస్తారు. వివిధ పథకాల ద్వారా లబ్దిదారులకు అందే సొమ్మును పాత అప్పుగా జమకాకుండా ఉండేలా బ్యాంకర్లతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. సచివాలయాల వద్దే రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంచేందుకు పనిచేస్తున్నారు. దీంతో ఇప్పటివరకూ టీడీపీ గగ్గోలు పెట్టిన ఇసుక విధానంపై కూడా క్లారిటీ రావడంతో ఇక జగన్ ని టచ్ చేసేవాళ్లే లేరనిపిస్తోంది. దీంతో జగన్ ని పాలసీల పరంగా ఎవరూ విమర్శించలేరని ఇకపై వారంతా ఫేక్ ప్రచారం మాత్రం చేసుకుంటారు వైసీపీ శ్రేణులు అంటున్నారు. వాటిని ఎప్పటికప్పుడు తిప్పి కొడుతున్నాం అని చెప్తున్నారు.