క్రికెట్ కు పుట్టిన్నిలైన ఇంగ్లాండ్ కొత్త ప్రపంచ ఛాంపియన్స్ గా అవతరించిన విషయం అందరికి తెలిసిందే. ఎన్నో ఏళ్ల నుండి దీనికోసం ఇంగ్లాండ్ ఎదురుచూస్తుంది. ఎంతమంది కెప్టెన్ లు మారిన ఎవరూ ఆ కప్ తీసుకురాలేకపోయారు. అలాంటిది ఎక్కడో ఐర్లాండ్ నుండి వచ్చి తన ఆటతో సత్తా చాటుకొని ఇంగ్లాండ్ కు ప్రస్తుతం సారధిగా వ్యవహరిస్తున్నారు. అతడే ఇయాన్ మోర్గాన్, ఈ వరల్డ్ కప్ టైటిల్ కూడా తన కెప్టెన్సీ లోనే వచ్చింది. ఇక మరో ఆటగాడు జో రూట్.. ఇతడు ఇంగ్లాండ్ తరపున టెస్ట్ లకు సారధిగా ఉన్నాడు. అయితే మొన్న ప్రపంచ కప్ ఫైనల్.. నిన్న ఆస్ట్రేలియా తో మూడో టెస్ట్ అనుకోకుండా గెలవలేని మ్యాచ్ లు గెలిచాయి. దీనంతటికీ కారణం ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ . అతడే ఒంటి చేత్తో అప్పుడు ఫైనల్ ఇప్పుడు ఈ టెస్ట్ గెలిపించాడు. అయితే ఇక అసలు విషయానికి వస్తే బెన్ స్టోక్స్ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇక రూట్ విషయానికి వస్తే కెప్టెన్ గా ఈ మధ్యకాలంలో అంతగా రాణించలేదు. ఇక వన్డేలకు మోర్గాన్ కెప్టెన్సీ వదిలేయాలనే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తుంది. దీంతో ఇప్పుడు ఈ రెండు ఫార్మాట్లో బెన్ స్టోక్స్ ను నియమించాబోతున్నరనే వార్తలు ఎక్కువగా వస్తున్నాయి.
