తాజాగా రాజధాని విషయంలో జరుగుతున్న వివాదంపై మాజీమంత్రి పరిటాల సునీత స్పందించారు. దీనిపై రాయలసీమ ప్రజలు తీవ్రంగా స్పందిస్తూ విమర్శిస్తున్నారు. రాయలసీమ ప్రాంతంలో 20 ఏళ్లుగా రాజకీయం చేస్తున్న మీరు గత ఐదేళ్లుగా మంత్రిగా ఉన్న మీరు మన రాయలసీమకు రావాల్సిన ఎయిమ్స్ ని మంగళగిరికి తరలిస్తే నోటమాట మాట్లాడలేదు.. శివరామ కృష్ణన్ కమిటీ సిఫార్సు ప్రకారం, శ్రీ బాగ్ ఒడంబడిక ప్రకారం రాజధాని కోస్తాలో పెడితే హైకోర్టు రాయలసీమలో పెట్టాలి.. మీరు దానిగురించి కూడా మాట్లాడలేదు.. అలాగే అమరావతిని ఫ్రీజోన్ చేసి అక్కడ రాయలసీమ వాసులకు ప్రాతినిధ్యం కల్పించాలని కూడా మాట్లాడలేదు.. తిరుపతి యూనివర్సిటీలో రాయలసీమకు దక్కాల్సిన సీట్లను ఇతర ప్రాంతాలకు ఇచ్చి రాయలసీమ విద్యార్థులకు ద్రోహం జరిగినా ఒక్కసారి కూడా మాట్లాడలేదు.. కానీ మీ కులస్తులకోసం రాజధానిని తరలిస్తారనే అనుమానం రాగానే అక్కడి బినామీ ఆస్తులను కాపాడటం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తానంటున్నారా.. ఓట్లేసిన సీమ ప్రజల మనోభావాల కన్నా అక్కడ ఉన్న ఆస్తుల మీదే మక్కువ ఎక్కువ మీకు అంటూ సీమవాసులు విమర్శలు గుప్పిస్తున్నారు.
