సాహోతో మరో భారీ హిట్ కొట్టేందుకు సిద్ధమైన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగంగా పాల్గొంటున్నారు.. సినిమాలో పొలిటీషియన్‌గా చేస్తే నిజంగా రాజకీయాల్లోకి వస్తానని కాదన్నారు. పాలిటిక్స్ వేరు పొలిటికల్ ఫిల్మ్ వేరు.. కథ బావుంటే చేయొచ్చని, యాక్షన్ సినిమా చేస్తూ బోలెడు మందిని చంపేస్తున్నాను కదా.. అలా బయట చేస్తున్నానా.? అని ప్రశ్నించారు.. చిరంజీవిని ముంబైలో కలవడంపై స్పందిస్తూ మేమిద్దరం ఒకే హోటల్‌లో ఉన్నాం.. అందుకే గౌరవంగా వెళ్లి కలిశానన్నారు. సాహో ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఆయన ఫోన్ చేసి చిరంజీవిగారు మాట్లాడిన విధానం నాకు భలే సంతోషంగా అనిపించిందన్నారు. ఫ్యాన్స్ ను కలుసుకోవడం తనకు ఎప్పుడూ ఇష్టమేనని చెప్పారు. 150 కోట్లతో సాహో చేయాలనుకుంటే రూ.350 కోట్లకు చేరిందని వెల్లడించారు.. ఈ క్రమంలోనే ప్రభాస్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ”నేనైతే అభిమానులను కొట్టలేను, తొయ్యలేను.. నాకు రక్షణగా ఉన్న బౌన్సర్స్ కూడా చేయడానికి ప్రయత్నించినా నాకు ఏదోలా ఉంటుంది. నాకు ఒక్క ఫ్యాన్ వస్తే చాలు అనుకున్నా కానీ ఇపుడు ఇంతమంది ఫ్యాన్స్ ఉండటం అంటే హ్యాపీనే కదా.. అన్నారు. ఎలాగూ నేను బయట కనిపించేది తక్కువ.. కనిపించినపుడు అభిమానం చూపిస్తారు. అది తనకు ఇష్టమే”నని పేర్కొన్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ కి ఎంత విలువిస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తన దృష్టిలో ఫ్యాన్స్ కి కొట్టడం లేదా బౌన్సర్లతో నెట్టించడం చాలా తప్పు అనేది ఆయన మాటల సారాశం.. అయితే ఎన్నో సందర్భాల్లో ఫ్యాన్స్ పట్ల అత్యంత దురుసుగా ప్రవర్తించిన బాలయ్యకు ఈ మాటలు చెంప పెట్టులా ఉన్నాయి. బాలయ్యే కాదు.. అభిమానుల పట్ల దురుసుగా ప్రవర్తించే ఎవ్వరైనా ప్రభాస్ ని చూసి నేర్చుకోవాల్సిందేనని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు.