సర్ డోనాల్డ్ జార్జ్ బ్రాడ్‌మాన్…ఇతనికి మరో పేరు ‘ది డాన్’. ఈ ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఆగష్టు 27, 1908 లో జన్మించారు. అతడి ఆట తీరుతో క్రికెట్ చరిత్రలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఆస్ట్రేలియన్ బాట్స్ మాన్ మొత్తంగా 52 టెస్ట్ మ్యాచ్ లు ఆడాగా 99.94 సగటుతో 6996 పరుగులు సాధించారు. ఇందులో 29 సెంచరీలు కూడా ఉన్నాయి. ఇందులో 334 పరుగులు ఇతని వ్యక్తిగత స్కోర్. బ్రాడ్‌మన్ ఆటకు దూరమయి 71 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ అతడి సగటు రికార్డు ఇంకా అలానే చెక్కు చెదరకుండా ఉంది. ఇటువంటి దిగ్గజ ఆటగాడు ఆగస్టు 14, 1948 ఆగస్టులో ఇంగ్లాండ్‌తో జరిగిన యాషెస్ సిరీస్‌లోని ఆఖరి మ్యాచ్‌తో ఆయన కెరీర్‌ను ముగించారు. ఇటువంటి దిగ్గజ ఆటగాడికి మనం కూడా బర్త్ డే విషెస్ తెలుపుదాం.