ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయిన మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పి. చిదంబరానికి బెయిల్ ఇవ్వడానికి సుప్రీం కోర్ట్ నిరాకరించింది. దీంతో పోలీసులు చిదంబరాన్ని తీహార్ జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం ఢిల్లీలోని సీబీఐ హెడ్ క్వార్టర్స్‌లో చిదంబరం ఉంటున్నారు. సీబీఐ రిమాండ్ ముగియడంతో ఆయన తీహార్ జైలుకు వెళ్లక తప్పని సరైంది.
తీహార్ జైలులో చిదంబరంకు సెల్ నెంబర్ 7ను కేటాయించబోతున్నారు. ఇందులో ఆర్ధిక నేరగాళ్లు ఉంటారు. మిగతా ఖైదీలకు ఉండే సదుపాయాలు మాత్రమే చిదంబరంకు ఉంటాయని.. పప్పు .. 4 చపాతీలు చిన్న బౌల్ లో ఇస్తామని తీహార్ జైలు అధికారులు చెబుతున్నారు. అతనికి సౌత్ ఇండియా ఫుడ్ కావాలంటే సెపరేట్‌గా స్నాక్స్ అందుబాటులో ఉంచుతామని అది కూడా కోర్టు ఆర్డర్ ప్రకారమని చెబుతున్నారు. జైల్లో చిదంబరంకు మంచం అది కూడా పరుపు లేకుండా ఉండేది మాత్రమే ఇస్తామంటున్నారు జైలు అధికారులు. సీనియర్ సిటిజన్స్‌కు మాత్రమే ఇటువంటివి ఉంటాయంటున్నారు. మిగతా వారు అయితే కింద పడుకోవాల్సిందేనని చెప్పారు. సో…మాజీ కేంద్రమంత్రిగా ఎంతో మంది రాజకీయ ప్రత్యర్థులను జైలు పాలు చేసిన చిదంబరం..ఇలా తీహార్ జైల్లో మామూలు గదిలో ఖైదీగా దుర్భరమైన జీవితం గడపాల్సి వస్తోంది. అందుకే అంటారు ప్రారబ్ద కర్మ ఒకటి ఉంటుందని..చేసిన పాపాలకు అనుభవించక తప్పదని..హోంమంత్రిగా చేసిన పనులే..ఇప్పుడు చిదంబరాన్ని కటకటాల పాలు చేసినట్లే అని చెప్పకతప్పదు.