ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఇంకా కోలుకోలేదని, ఇంకా ఆయన శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని కోడెల అల్లుడు డాక్టర్ మనోహర్ వెల్లడించారు. ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురవడం వల్ల కోడెలకు గుండెపోటు వచ్చిందని తెలిపారు. గతంలో ఇలాగే కోడెలకు గుండెపోటు వస్తే స్టంట్ వేశామని చెప్పారు. ప్రస్తుతం శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడుతున్నారని ఆయన తనకు ఫోన్ చేసిన మాజీ సీఎం చంద్రబాబుకు వివరించారు. 48గంటలు గడిచిన తరువాత ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంటే యాంజియోగ్రామ్ చేయడానికి ప్రయత్నిస్తామని, అవసరమైతే హైదరాబాద్ లోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కు తరలించాలని డాక్టర్ మనోహర్ అన్నారు. ప్రస్తుతం గుంటూరులోని శ్రీలక్ష్మీసూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఐసీయూలో కోడెలకు చికిత్స జరుగుతోంది. ఈ క్రమంలో కోడెలను చంద్రబాబు ఫోన్ లో పరామర్శించారట.. ఆరోగ్యం బాగానే ఉందా అని వివరాలు అడిగారట.. ఫర్నీచర్ మొత్తాన్ని వెనక్కి ఇచ్చేయండి అంటూ సున్నితంగా చెప్పారట.. దానికి కూడా కోడెల సరేనన్నారట.. ఇప్పటికే అనేక కేసులు ఇబ్బందుల్లో మీరు ఉన్నారు.. ఇప్పుడు మళ్లీ కొత్త వివాదాలు ఎందుకు ఫర్నీచర్ కేసు పేరుతో ఉన్నతాధికారులు, పోలీసులు వచ్చి కూపీలు లాగితే పాత వ్యవహారాలన్నీ మళ్లీ బయటకు వస్తాయి.. ఎందుకు ఆ ఫర్నీచర్ గురించి అంత వివాదం అని అన్నారట.. సెక్యూరిటీ కోసమే మీ ఇంట్లో ఉంచినా ఇప్పుడు మనం ప్రభుత్వంలో లేము కాబట్టి మన దగ్గర ఉంచుకోకూడదంటూ చంద్రబాబు చెప్పగా కోడెల తానెప్పుడో వచ్చి తీసుకెళ్లాలని కోరానని చెప్పారట.