Home / ANDHRAPRADESH / కుటుంబ పెద్ద చనిపోయినపుడు ఉన్న జగన్ జైల్లో పెట్టినపుడు వారు చేసిన త్యాగం, పోరాటం మన కష్టాలముందు

కుటుంబ పెద్ద చనిపోయినపుడు ఉన్న జగన్ జైల్లో పెట్టినపుడు వారు చేసిన త్యాగం, పోరాటం మన కష్టాలముందు

వైయస్‌ కుటుంబంలోని వైయస్‌ విజయమ్మ, వైయస్‌ భారతమ్మ, వైయస్‌ షర్మిళమ్మలే నేటి మహిళలకు, తనకు ఆదర్శమని ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ గా నియమితులైన వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. మహిళా కమిషన్‌ చైర్ పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ నామినేటెడ్‌ పదవులు, పనుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు, స్థానికులకు పరిశ్రమల్లో 75శాతం ఉపాధి అవకాశాలు కల్పించాలని తాజాగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చట్టం చేసారని తెలిపారు. మహిళలంతా ఆర్థికంగా, సామాజికంగా వారి కాళ్లపై నిలబడాలని జగన్‌ ప్రభుత్వం భావిస్తోందని, అందులో భాగంగా దశలవారీ మద్యపాన నిషేదం మొదలుపెట్టారన్నారు. మహిళా కమీషన్‌ అంటే నేరం జరిగిన తరువాత వెళ్లి పరామర్శించేది కాదని, నేరం జరగకముందే వాటిని నియంత్రించేందుకు పని చేస్తామన్నారు. చిన్నతనంలో ఆడ,మగ తేడా లేకుండా చూసేందుకు కృషి చేస్తామన్నారు. జగన్‌ రాష్ట్రంలోని మహిళలందరికీ అన్నగా అండగా ఉంటారని, మహిళలందరికీ మంచి రోజులు వచ్చాయన్నారు. వైయస్‌ఆర్‌ కుటుంబంలోని వైయస్‌ విజయమ్మ, భారతమ్మ, షర్మిలమ్మ ఈ ముగ్గురు మహిళలు కష్టాలు ఎలా ఎదుర్కొన్నారో మహిళలకు వారే ఆదర్శప్రాయమన్నారు. మహిళలకు బాధగా ఉన్నప్పుడు ఈ ముగ్గురిని గుర్తు చేసుకోవాలన్నారు. కష్టాలున్నపుడూ ఈ ముగ్గురు మహిళలు చిరునవ్వుతో ఎలా ఎదుర్కొన్నారో మనంకూడా అలాగే ఎదుర్కొందామన్నారు. భర్త చనిపోయిన తర్వాత కొడుకుని జైల్లో పెట్టినపుడు విజయమ్మ, రేయింబవళ్లూ తమని విడిచి ప్రజల్లో ఉన్న భర్తపై నిందలు వేసి జైల్లో పెట్టినపుడు, తననూ కేసుల్లో ఇరికించినపుడు భారతమ్మను, తండ్రి ఆశయసాధనకోసం వేల కిలో మీటర్లు నడిచిన షర్మిళమ్మపై దిగజారుడు ప్రచారం చేసినా దిగమింగినందుకు ఆమెను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat