ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ,వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాష్ట్రంలో తిరుగులేని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి మంచి పరిపాలన అందిస్తున్నారని బీజేపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కొనియాడారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో రాజధాని ఒకే ప్రాంతంలో ఉండటం వల్ల మిగతా ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. రాజధాని ప్రాంతంలో అభివృద్ధి జరిగి ఉంటే మంగళగిరిలో నారా లోకేష్ ఓడిపోయే వారు కాదని దారుణంగా విమర్శించారు. రాజధాని ప్రాంతం రైతులు వైఎస్ జగన్‌కు ఓటు వేశారని తెలిపారు. కర్నూలు జిల్లాలో రాజధాని ప్రకటిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీజీ వెంకటేష్ మాట్లాడుతూ…నవ్యాంధ్రకు నాలుగు రాజధానులు ఉండబోతున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక అమరావతిపై ఆశలు వదుకోవాల్సిందేనని చెప్పిన ఆయన ప్రత్యామ్నాయ రాజధానులపై ఇప్పటికే ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ బీజేపీ అధిష్ఠానంతో చర్చించారని కూడా పేర్కొన్నారు. ప్రస్తుతం టీజీ వాఖ్యలు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి.
